Beauty Alia Bhatt :నాగ్ అశ్విన్ మూవీలో అలియా భ‌ట్

శ‌ర వేగంగా క‌ల్కి2 షూటింగ్

Alia Bhatt : బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ బి టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. త‌ను ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌లో బిజీగా ఉంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీస్తున్న ల‌వ్ అండ్ వార్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ , విక్కీ కౌశ‌ల్ ల‌తో క‌లిసి న‌టిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. త‌న త‌దుప‌రి సినిమాను ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తోంది.

Alia Bhatt Movie Updates

200 రోజుల‌కు పైగా షూటింగ్ జ‌రిగేలా ప్లాన్ చేశారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాలో అలియా భ‌ట్(Alia Bhatt) పెట్టుబ‌డి కూడా పెట్ట‌డం విశేషం. తాజాగా మ‌రో వార్త గుప్పుమంటోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తో క‌లిసి కొత్త ప్రాజెక్టుపై చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, ఈ మేర‌కు ఒప్పందం కూడా చేసుకున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా క‌ల్కి 2898 ఏడీ తో ప్ర‌సిద్ది చెందిన నాగ్ అశ్విన్ తొలుత సీక్వెల్ పై ప‌ని ప్రారంభించాల‌ని భావించారు. అలియా భ‌ట్ ను ఇందులో ప్రాధాన్య‌త ఇచ్చే పాత్ర ఇవ్వాల‌ని యోచిస్తున్న‌ట్లు పేర్కొంది. త‌ను ఈ మూవీతో జాతీయ అవార్డు గ్ర‌హీత‌.

ఈ సినిమా నిర్మాణం నవంబర్‌లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు, ప్రస్తుతం లాజిస్టిక్స్ ఖరారు అవుతున్నాయి. ఈ ఉత్తేజకరమైన సహకారం కోసం అంచనాలు పెరుగుతున్నందున అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read : Beauty Ileana- 2nd Baby :ఇలియానా డిక్రూజ్ ప్రెగ్నెన్సీ క‌న్ ఫర్మ్

Alia BhattMoviesNag AshwinTrendingUpdates
Comments (0)
Add Comment