Akshaye Khanna : బాలీవుడ్ లో స్టార్ హీరో గా గుర్తింపు పొందాడు అక్షయ్ ఖన్నా(Akshaye Khanna). తను ఇటీవల చారిత్రాత్మకమైన చిత్రం ఛావాలో కీ రోల్ పోషించాడు. ప్రశాంత్ వర్మ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. తను దర్శకుడిగా గుర్తింపు పొందాడు. కల్కి, జంబి రెడ్డి కమర్షియల్ విజయాలు అందుకున్నాడు. హనుమాన్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా దర్శకుడిగా పేరొందాడు. ఉన్నట్టుండి కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కీ రోల్ లో నటిస్తాడంటూ ప్రకటించాడు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు ఉన్నట్టుండి ఆగి పోయింది.
Akshaye Khanna Movie Updates
తాజాగా తను ప్రశాంత్ సినీ వర్క్క్స్ ను ఏర్పాటు చేశాడు ప్రశాంత్ వర్మ. ఆ మధ్యన నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో మూవీ ఉంటుందని ప్రకటించాడు. కానీ అది కూడా ఇంకా పట్టాలు ఎక్కలేదు. ప్రస్తుతం ప్రకటించిన పీసీయూ నుంచి తను దర్శకత్వం వహించడం లేదు. కొత్త మూవీ రాబోతోంది అదే మహాకాళీ. అపర్ణ కొల్లూరు దర్శకత్వం చేస్తోంది. తను డైరెక్షన్ కాకుండా కేవలం స్టోరీ మాత్రమే అందించడం విశేషం.
ప్రస్తుతం మరో అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఇందులో కీలక పాత్ర పోషిస్తాడని అక్షయ్ ఖన్నా గురించి. మరాఠా యోధుడు శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఛావా. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా కీలక పాత్రల్లో నటించారు. ఇందులో ఔరంగాజేబు పాత్రను పోషించాడు అక్షయ్ ఖన్నా. గతంలో బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు తను. ఆయన ఎంపికతో రాబోయే సినిమాకు మరింత బలం కానుంది.
Also Read : Popular Director Rajamouli-SSMB29 :డిఫరెంట్ గా చూపించ బోతున్న జక్కన్న