Hero Akshay Kumar :అక్ష‌య్..ట్వింకిల్ ఆస్తుల విలువ రూ. 2850 కోట్లు

సౌత్ ముంబైలో రూ. 80 కోట్ల‌కు అపార్ట్మెంట్ అమ్మ‌కం

Akshay Kumar : బాలీవుడ్ లో టాప్ హీరోగా కొన‌సాగుతున్నాడు అక్ష‌య్ కుమార్. త‌న‌కు ప్ర‌ధాని మోడీతో క‌నెక్టివిటీ కూడా ఉంది. ఆ మధ్య‌న తానే స్వ‌యంగా పీఎంను ఇంట‌ర్వ్యూ చేశాడు. తాజాగా ఇండియాలో సినీ సెలబ్రిటీల ఆస్తుల విలువ చూస్తే దిమ్మ తిరిగేలా ఉంది. ద‌క్షిణాదిన మ‌న్మ‌థుడిగా పేరొందిన అక్కినేని నాగార్జున నిక‌ర ఆస్తుల వాల్యూ ఏకంగా రూ. 3 వేల కోట్ల‌కు దాటిందని అంచ‌నా. ఇక స‌ల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, జూహ్లీ చావ్లా, అమితాబ్ బ‌చ్చ‌న్ , మెగాస్టార్ చిరంజీల ఆస్తులు భారీ ఎత్తున పెరిగాయి.

Akshay Kumar Net Worth

తాజాగా హాట్ టాపిక్ గా మారారు బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్(Akshay Kumar), ట్వింకిల్ ఖ‌న్నాలు. త‌మ‌కు చెందిన సౌత్ ముంబైలోని అపార్ట్మెంట్ ను ఏకంగా రూ. 80 కోట్ల‌కు అమ్మేశాడు. దీంతో త‌న ఆస్తుల విలువ దీనిని అమ్మ‌డంతో రూ. 2,850 కోట్ల‌కు చేరుకుందని స‌మాచారం. అత్యంత విలాస‌వంత‌మైన భ‌వనంగా దీనిని తీర్చిదిద్దారు. అందుకే భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయింది.

సౌత్ ముంబైలోని ఆస్తిని ఒబెరాయ్ రియాల్టీ సంస్థ అభివృద్ది చేసింది. 4 బీహెచ్ కే, 5 బీహెచ్ కే ఫ్లాట్ ల‌తో పాటు పెంట్ హౌస్ లు కూడా ఉన్నాయి అక్ష‌య్ కుమార్, ట్వింకిల్ ఖ‌న్నాకు. ప్ర‌స్తుతం అమ్మేసిన భ‌వ‌నం 6,830 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 39వ అంత‌స్తులో ఉన్న దీనికి భారీ ధ‌ర పెట్టారు. 4 పార్కింగ్ స్థ‌లాల‌ను కూడా క‌లిగి ఉంది.

ఈ భ‌వ‌నం లావాదేవీలు జ‌న‌వ‌రి 31న 2025న పూర్త‌యింది. ఇందులో రూ. 4.80 కోట్ల స్టాంప్ డ్యూటీ కూడా ఉంది. ఇదే స‌మ‌యంలో బోరివాలి లోని స్కై సిటీలోని త‌న అపార్ట్ మెంట్ ను రూ. 4.25 కోట్ల‌కు విక్ర‌యించాడు.

Also Read : Sherlyn Chopra Shocking :ప్రియాంకా ఛాన్స్ లు లేవంటే ఎలా..?

akshay kumarTrendingUpdates
Comments (0)
Add Comment