Akshay Kumar: అక్షయ్‌కుమార్, అనిల్ కపూర్, రవీనా టాండన్, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లారా దత్తా, తుషార్ కపూర్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’. బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వెల్‌కమ్’ ఫ్రాంచైజీలో ఈ మూడో భాగంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుండి డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టు నుండి సంజయ్ దత్ తప్పుకోవడంతో నిరాశలో ఉన్న అభిమానులకు మంచి కిక్కిచ్చే గుడ్ న్యూస్ ను చిత్ర యూనిట్ అందించింది. దీనితో ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ న్యూస్ తో మరింత ఉత్కంఠకు గురవుతున్నారు.
Akshay Kumar Movie Updates
‘వెల్‌కమ్ టు ది జంగిల్’ సినిమాకు సంబంధించి ముంబయిలో ఇటీవలే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 గుర్రాలతో హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) పై పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించారు. ఏడు రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్‌లో సన్నివేశాల్ని మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దారని బీ టౌన్ వర్గాల టాక్. సుమారు పది ఎకరాల స్థలంలో భారీ సెట్ వేసి ఈ ఘట్టాల్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబరు 20న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
Also Read : Manjummel Boys: ఇళయరాజా లీగల్ నోటీసులపై స్పందించిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాత !