Chai Sobhita : అక్కినేని హీరో నాగచైతన్య, థండరింగ్ బ్యూటీ శోభితల విహహం డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు అఖిల్ పెళ్లి కూడా ఫిక్స్ కావడంతో అక్కినేని ఫ్యామిలిలో పెళ్లి భాజాలు సౌండ్ మారుమోగుతోంది. ఈ నేపథ్యంలోనే అంతా పెళ్లి సంబరాల్లో సంబరాల్లో మునిగిపోయారు.
Chai Sobhita Marriage Updates
తాజాగా నాగ చైతన్య(Naga Chaitanya), శోభితల హల్దీ వేడుక నిర్వహించారు. ఇరువురికి మంగళ స్నానాలు చేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటో లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి గురించి నాగ్ మాట్లాడుతూ.. ఈ పెళ్లి వేడుకకు మా కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులలో ఓ 300 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నాము. అందమైన వివాహ వేదిక సెట్‌ను ఈ పెళ్లి కోసం సిద్ధం చేస్తున్నారు. పెళ్లి పనులు కూడా చై శోభిత దగ్గరుండి చూసుకుంటున్నారు. శోభిత వాళ్ల తల్లిదండ్రులు కూడా ఎంతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని మమ్మల్ని కోరారు. నాకు కూడా పెళ్లి మంత్రాలు వినడం ఎంతో ఇష్టం. అవి వింటుంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’’ అని తెలిపారు. మరోవైపుఈ పెళ్లిని ఈ పెళ్లిని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి. కానీ.. ఆ వార్తల్లో నిజం లేదని అక్కినేని వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఈ పెళ్లిని ప్రైవేట్ గా, అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహిస్తారని తెలిపారు.
Also Read : Rishab Shetty : మరో టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రిషబ్ శెట్టి