Big Boss 8 : బిగ్ బాస్ స్టేజ్ పైకి అక్కినేని కొత్త జంట

ఈ జంట త్వరలో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8’ స్టేజ్ పైకి రానున్నారని తెలుస్తోంది...

Big Boss 8 : నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట ఇటీవల హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు నాగ చైతన్య. ఈ ఇద్దరూ కలిసి చాలా కాలంగా తిరుగారు. ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. నిశ్చితార్థం తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

ఈ జంట త్వరలో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8(Big Boss 8)’ స్టేజ్ పైకి రానున్నారని తెలుస్తోంది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళల నిశ్చితార్థం గత నెలలో జరిగింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం గోప్యంగా ఉంచారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూశారు. అప్పుడే సడన్ గా ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. నాగ చైతన్య, శోభిత బిగ్ బాస్ హౌస్‌కి గెస్ట్‌లుగా రాబోతున్నారని టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ లో వారాంతంలో అతిథులను ఆహ్వానిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. అలాగే కొంతమంది తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు వచ్చారు.

Big Boss 8…

ఇప్పుడు నాగ చైతన్య, శోభిత బిగ్ బాస్‌కు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ హౌస్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ తో మాట్లాడతారా..? లేక బిగ్ బాస్ వేదికపైకి వచ్చి హోస్ట్ అక్కినేని నాగార్జునతో మాట్లాడతారా.? అనేది తెలియాల్సి ఉంది. నాగ చైతన్య, శోభిత ఇప్పటి వరకు కలిసి కనిపించలేదు. ఒక్కసారి బిగ్ బాస్ లోకి వస్తే కచ్చితంగా టీఆర్పీ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇటీవలే ప్రారంభమైన సీజన్ 8 దూసుకుపోతోంది. ప్రస్తుతం హౌస్ లో 14మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మరికొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.

Also Read : Hansika Motwani : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ‘హన్సిక’

Akkineni Naga Chaitanyabig bossSobhita DhulipalaTrendingUpdatesViral
Comments (0)
Add Comment