Akkineni Nageswara Rao: స్వగ్రామంలో ఏఎన్నార్ శత జయంతి వేడుకలు !

స్వగ్రామంలో ఏఎన్నార్ శత జయంతి వేడుకలు !

Akkineni Nageswara Rao: పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. గుడివాడ దగ్గర అక్కినేని స్వగ్రామం అయిన వెంకట రాఘవపురం నందు రాష్ట్ర అక్కినేని ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గ్రామములో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురాణం వెంకటరమణ, సుబ్బారావు, నవీన్ ప్రసాద్,, బి ఆర్ దాసు, వెంకట ముని, సుకుమార్ రెడ్డి, ప్రభాకర్ రావు, షఫీ , తదితరులు అక్కినేని గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి కొనియాడారు. ఈ సోమవారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Akkineni Nageswara Rao…

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేర్లలో అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) ఒకరు. ఒక నటుడిగా, నిర్మాతగా తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన పేజీను లిఖించుకున్నారు. తన డెబ్బై ఐదేళ్ల కెరీర్‌ లో అనేక మైలురాయి చిత్రాలలో నటించాడు మరియు తెలుగు సినిమా యొక్క అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకడు అయ్యాడు. అక్కినేని ఏడు రాష్ట్రాల నంది అవార్డులు , ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు . 38వ జాతీయ చలనచిత్ర అవార్డులు (1990) లో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించారు . కళ మరియు సినిమా రంగాలకు ఆయన చేసిన సేవలకు గాను భారతదేశం యొక్క రెండవ, మూడవ మరియు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ విభూషణ్ (2011), పద్మ భూషణ్ (1988) మరియు పద్మశ్రీ (1968) లతో సత్కరించారు .

Also Read : Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ పై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ హీరో !

Akkineni Naga ChitanyaAkkineni Nageswara RaoNagarjuna Akkineni
Comments (0)
Add Comment