Beauty Sobhita Entry :శోభిత వ‌చ్చాక చైత‌న్య‌లో క‌ళ వ‌చ్చింది

అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర కామెంట్స్

Sobhita : త‌న కొత్త కోడ‌లు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు న‌టుడు , ప్ర‌యోక్త అక్కినేని నాగార్జున‌. అక్కినేని నాగ చైత‌న్య తొలుత పాన్ ఇండియా హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భును పెళ్లి చేసుకున్నాడు. ఇద్ద‌రూ కొంత కాలం ఆనందంగా గ‌డిపారు. ఏమైందో ఏమో కానీ త‌ను వెబ్ సీరీస్ లో మ‌రీ బోల్డ్ గా న‌టించ‌డంతో త‌ట్టుకోలేక పోయాడు చైత‌న్య‌. ఉన్న‌ట్టుండి ఇద్ద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎక్స్ హ్యాండిల్ లో తామిద్ద‌రం విడి పోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Sobhita Entry

నెటిజ‌న్లు, ఫ్యాన్స్ స‌మంత‌కు అన్యాయం చేశారంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో నాగ చైత‌న్య చాలా కామ్ గా ఉండి పోయాడు. నాగార్జున ఈ అంశం గురించి ఎక్క‌డా మాట్లాడ‌లేదు.

ఇదే స‌మ‌యంలో నాగ చైత‌న్య తాజాగా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్లవితో క‌లిసి తండేల్ మూవీ చేశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. రూ. 50 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించాడు నిర్మాత బ‌న్నీ వాసు. ప్ర‌స్తుతం నాలుగు రోజుల్లోనే రూ. 73 కోట్లు కొల్ల‌గొట్టింది. వారం పూర్త‌య్యే స‌రికి రూ. 100 కోట్ల‌ను క్రాస్ చేస్తుంద‌ని సినీ ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. తండేల్ స‌క్సెస్ సంద‌ర్బంగా జ‌రిగిన ఈవెంట్ లో నాగార్జున పాల్గొన్నాడు.

స‌మంత‌తో విడి పోయాక నాగ చైత‌న్య తీవ్ర నిరాశ‌కు లోన‌య్యాడ‌ని, ఆ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి శోభిత ధూళిపాళ(Sobhita) రావ‌డంతో తిరిగి మ‌నిషిగా మారాడ‌ని చెప్పాడు. ఆమె వ‌చ్చాక త‌మ ఇల్లు క‌ళ క‌ళ లాడుతోందని అన్నాడు. తాజాగా నాగ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. అయితే స‌మంత మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది.

Also Read : Hero Chiranjeevi Movie :మెగాస్టార్ మూవీకి భీమ్స్ మ్యూజిక్

Akkineni Naga Chaitanyaakkineni nagarjunaCommentsSobhita DhulipalaTrending
Comments (0)
Add Comment