Akkineni Naga Chitanya: యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించిన నాగ చైతన్య

యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించిన నాగ చైతన్య

యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించిన నాగ చైతన్య

Akkineni Naga Chitanya : వ్యక్తిగత సమాచారం నుండి సినిమా ప్రమోషన్ వరకు ఏ సమాచారం తెలియజేయాలన్నా సెలబ్రెటీలకు ఇప్పుడు సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారింది. తమకు సంబందించిన ఏ సమాచారం అభిమానులతో షేర్ చేసుకోవాలన్నా ఏదో ఒక సోషల్ మీడియా వేదిక తప్పనిసరి అవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే సెలబ్రెటీలు, అభిమానులకు మధ్య సోషల్ మీడియా వారధిగా మారిపోయింది.

దీనితో ‘ఎక్స్‌’ (ట్విటర్‌), ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌తోపాటు యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం, అభిమానులతో చిట్ చాట్ జరపడంతో పాటు వారి సినిమాల ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు. దీనితో ఆయా సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించే సెలబ్రెటీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలో కొత్తగా అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chitanya) చేరారు. అక్కినేని నాగ చైతన్య పేరుతో ఛానల్ ను క్రియేట్ చేసిన ఆయన శుక్రవారం ఓ వీడియో పోస్ట్ చేసారు. అంతేకాదు ఆ యూట్యూబ్ ఛానెల్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేసారు.

Akkineni Naga Chitanya – అభిమానులతో ‘చై’ చిట్ చాట్

యూట్యూబ్ ఛానెల్ వేదికగా అభిమానులు సంధించిన ప్రశ్నలకు చైతన్య ఇలా ఫన్నీ సమాధానాలు ఇచ్చారు. ‘చాలాకాలం తర్వాత జుట్టు, గడ్డం పెంచారు. కారణమేంటో తెలుసుకోవచ్చా?’ అని ఓ అభిమాని అడగ్గా ‘ఆరు నెలలుగా నాకు జాబ్‌ లేదు… ఇంట్లో ఖాళీగా ఉంటున్నా… పనేంలేక జుట్టు, గడ్డం పెంచా’ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. అయితే దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించునున్న #NC23 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా కోసం తాను గెడ్డం, జుట్టు పెంచినట్లు తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’ గురించి మాట్లాడుతూ… దూత ఎవరో తెలియాలంటే సోషల్‌ మీడియాలో దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ఖాతాను ట్యాగ్‌ చేసి అడిగితే ఆన్సర్‌ వస్తుందని చెప్పారు.

హ్యాట్రిక్ సినిమాతో వస్తున్న చందూ-చైతన్య

‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత చైతన్య- చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందునున్న చిత్రమే #NC23. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రా జిల్లాల నుండి వలస వెళ్ళి పాకిస్తాన్ జైల్ లో బందీలుగా మారిన మత్స్యకారులువారి జీవితాలకు అద్దం పట్టే విధంగా ఓ యథార్థ ఘటన ఆధారంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. తన సరసన సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమా కోసం చైతన్య శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. అలాగే నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ‘దూత’ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబరు 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read : Aadi Keshava: రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా వైష్ణవ్ తేజ్

Akkineni Naga Chitanya
Comments (0)
Add Comment