Akhil Akkineni : ఓ కొత్త పిరియాడికల్ డ్రామా లో కనిపించనున్న అఖిల్ అక్కినేని

ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతున్నట్లుగా అయితే ఎటువంటి అప్డేట్ ఇంత వరకు రాలేదు...

Akhil Akkineni : అఖిల్‌ అక్కినేని ‘ఏజెంట్‌’సినిమా పరాజయం తర్వాత ఆయన నుంచి మరో సినిమా అప్‌డేట్‌ రాలేదు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పటికీ ఓటీటీలో కూడా విడుదల కాలేదు. ఈ మూవీ వచ్చి ఏడాది దాటినా తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చెయ్యలేదు అఖిల్‌. దీంతో అసలు అఖిల్‌(Akhil Akkineni) కు ఎలాంటి సినిమా పడాలి? అఖిల్‌ని ఎలా ప్రేక్షకులలో నిలబెట్టాలి? అనే ఆలోచనలో పడ్డారట కింగ్ నాగార్జున. అయితే ఈ సారి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి అఖిల్ ప్రాజెక్ట్స్ ని పరిశీలిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఒక స్మాల్ డైరెక్టర్ పీరియాడికల్ డ్రామా ప్రాజెక్ట్ కి అఖిల్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే..

Akhil Akkineni Movie Updates

వాస్తవానికి ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఉంటుందనేలా ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది కానీ.. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతున్నట్లుగా అయితే ఎటువంటి అప్డేట్ ఇంత వరకు రాలేదు. ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమోగానీ.. ఇప్పుడు ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చటంతో అఖిల్‌(Akhil Akkineni) సినిమాకి ఓకే చెప్పాడట.కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి హిట్టు సినిమా తీసిన‌ మురళీ కిషోర్ చెప్పిన కథ నచ్చడంతో.. అఖిల్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉండబోతుందని, ఈ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుబంధంగా మనం ఎంటర్‌ప్రైజెస్ అనే బ్యానర్‌లో ఈ సినిమాను నాగార్జున, చైతన్య నిర్మించాలని చూస్తున్నారట. ఇక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఒకటే బాకీ అని సమాచారం.

మరోవైపు అఖిల్‌ ఎన్నడూ లేని విధంగా గుబురు గడ్డం, కోర మీసాలు, పొడవాటి జుట్టుతో సూపర్‌ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అయ్యగారి లేటెస్ట్‌ లుక్‌ చూసి అందరూ అవాక్కవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్‌ మాత్రం తమ హీరో నయా లుక్‌ చూసి ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ మేకోవర్‌ అంతా కచ్చితంగా తన తదుపరి చిత్రం కోసమే అని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. అయితే అఖిల్‌(Akhil Akkineni).. అనిల్‌ కుమార్‌ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ‘ సాహో’, ‘రాధేశ్యామ్‌’ వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అఖిల్‌ 6’ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ అని, దీనికి ‘ధీర’ అనే టైటిల్‌ కూడా అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఏప్రిల్‌లో బర్త్‌డే స్పెషల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను అధికారిక ప్రకటన చేస్తారనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ఇప్పుడు అఖిల్‌ ఈ మూవీ కోసమే సరికొత్తగా మేకోవర్‌ అవుతున్నారని టాక్‌ వినిపిస్తోంది.

Also Read : Aindham Vedham : మక్కల్ సెల్వన్ సేతుపతి చేతులమీదగా ‘ఐందం వేదం’ ట్రైలర్..

Akkineni AkhilMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment