Hero Akhil Akkineni :అఖిల్ అక్కినేని మూవీ టైటిల్ ఫిక్స్

మూడేళ్ల త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ

Akhil Akkineni : అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని త‌ను న‌టించిన కొత్త మూవీ గురించి అప్ డేట్ వ‌చ్చింది. చాలా గ్యాప్ అంటే దాదాపు 3 ఏళ్ల త‌ర్వాత సినిమాల్లోకి తిరిగి వ‌చ్చాడు. అఖిల్ 6 అని ప్ర‌స్తుతానికి పేరు పెట్టారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ పూజా హెగ్డేతో బ్యాచ్ ల‌ర్ మూవీ తీశాడు. ఆ త‌ర్వాత ఏ ఒక్క మూవీకి త‌ను సంత‌కం చేయ‌లేదు. ముంబై భామ‌తో డేటింగ్ చేశాడు. త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Akhil Akkineni Movie Updates

ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌రమైన ఫోటోను షేర్ చేశాడు త‌న ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో . పోస్ట‌ర్ పై అద్భుత‌మైన క్యాప్స‌న్ కూడా జ‌త చేశాడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni). రెండు చేతుల‌ను మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించిన దీనిలో ప్రేమ కంటే యుద్దం హింసాత్మ‌కం కాదు అని పేర్కొన్నాడు. తాజాగా తాను చేసిన ఈ పోస్ట్ వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా ద‌ర్శ‌కుడు రొమాంటిక్, యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు పోస్ట‌ర్స్ ను బ‌ట్టి చూస్తే తెలుస్తుంది.

ఇక ఈ కొత్త సినిమాకు సంబంధించి ఇంకా వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు మూవీ మేక‌ర్స్. దానిని అత్యంత గోప్యంగా ఉంచారు. ఎందుకో వారికే తెలియాలి. పూర్తి తారాగ‌ణంతో స‌హా అధికారిక గ్లింప్స్ అఖిల్ అక్కినేని పుట్టిన రోజు సంద‌ర్బంగా విడుద‌ల చేస్తార‌ని టాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అఖిల్ అంత‌కు ముందు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏజెంట్ లో క‌నిపించాడు. దానికి క‌థ వంశీ రాశాడు. అనిల్ సుంక‌ర‌, రామబ్ర‌హ్మం నిర్మించారు.

Also Read : Vaishnavi Chaitanya Sensational :నోరు జారిన వైష్ణ‌వి చైత‌న్య

Akkineni AkhilCinemaUpdatesViral
Comments (0)
Add Comment