Hero Akhil Agent Movie :మార్చి 14న రానున్న అఖిల్ ఏజెంట్

సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది

Agent : ద‌మ్మున్న డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌ను ర‌వితేజ‌, ఇలియానాతో తీసిన కిక్ కిక్కించేలా చేసింది. కాసుల వ‌ర్షం కురిపించింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్(Akhil Akkineni) తో క‌లిసి ఏజెంట్(Agent) పేరుతో కొత్త‌గా మూవీ తీశాడు.

Agent Movie Updates

ఇది ఏప్రిల్ 28, 2023లో థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆశించిన మేర ఆడ‌లేదు. ప్రేక్ష‌కుల‌కు ఎందుక‌నో ఈ మూవీ న‌చ్చ‌లేదు. దీంతో డిజాస్ట‌ర్ గా నిలిచి పోయింది. అక్కినేని ఫ్యామిలీకి తీవ్ర నిరాశ‌ను మిగిల్చింది.

ఈ స‌మ‌యంలో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తీసిన మూవీతో తిరిగి అఖిల్ న‌టించాడు. ఇందులో పూజా హెగ్డే కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా సురేంద‌ర్ రెడ్డి కీల‌క అప్ డేట్ ఇచ్చాడు. ప్రేక్ష‌కులు ఆద‌రించ‌క పోయినా స‌రే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు మార్చి 14వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యారు.

ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా , మూవీ కంపెనీ సోనీ లివ్ లో రానుంద‌ని ప్ర‌క‌టించారు. ఏజెంట్ మూవీ క‌థ‌ను వ‌క్కంతం వంశీ త‌యారు చేశాడు. స్పై థ్రిల్లర్‌లో సాక్షి వైద్య ప్రధాన పాత్రలో, నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో, బాలీవుడ్‌కు చెందిన డినో మోరియా బలీయమైన విలన్‌గా నటించారు. సమిష్టి తారాగణంలో విక్రమ్‌జీత్ విర్క్, డెంజెల్ స్మిత్, సంపత్ రాజ్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Also Read : Hero Shah Rukh-Janhvi Song :బాద్ షా..జాహ్న‌వి సునా హై ఇష్క్ మే వైర‌ల్

AgentCinemaTrendingUpdates
Comments (0)
Add Comment