Hero Balayya-Adi Pinishetty : బాల‌య్య‌తో ఆది పినిశెట్టి ఢీ

అఖండ‌2 మూవీలో విల‌న్ గా

Adi Pinishetty : బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సీక్వెల్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ‌తో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాడు. అఖండ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. బోయ‌పాటి, బాల‌య్య సూప‌ర్ కాంబినేష‌న్ మ‌రోసారి చ‌రిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అయ్యాడు ద‌ర్శ‌కుడు.

Adi Pinishetty Movie with Balakrishna

బాల‌య్యకు సంబంధించి భావోద్వేగాల‌ను ప‌లికించ‌డంలో, తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో త‌న‌కు తానే సాటి . ఈ సినిమాలో ఇప్ప‌టికే హీరోయిన్ ను కూడా ఎంపిక చేశారు. తొలుత ప్ర‌గ్యా జైశ్వాల్ అని అనుకున్నారు. కానీ ఉన్న‌ట్టుండి బోయ‌పాటి శ్రీ‌ను మ‌ల‌యాళ సినీ న‌టి సంయుక్త మీన‌న్ ను ఎంపిక చేసిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఈ ఎంపిక‌కు సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు మూవీ మేక‌ర్స్.

తాజాగా మ‌రో అఖండ2 మూవీకి సంబంధించి అప్ డేట్ వ‌చ్చింది. బాల‌య్య‌కు ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ఆది పినిశెట్టిని(Adi Pinishetty) ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. త‌ను అల్లు అర్జున్ తో క‌లిసి విల‌న్ పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. అది కూడా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిందే కావ‌డం విశేషం.

మ‌రో వైపు యూపీలోని ప్ర‌యాగ్ రాజ్ లో కొన‌సాగుతున్న మ‌హా కుంభ మేళాలో చిత్రీక‌రించారు.

Also Read : Hero Vishwak-Laila Movie :లైలా ప‌క్కా రొమాంటిక్ ఎంటర్‌టైనర్

Adi PinishettyBalakrishnaCinemaTrendingUpdates
Comments (0)
Add Comment