Ajith : కోలీవుడ్ లో హిట్టు ఫ్లాపులను పట్టించుకోని నటుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా ఠకీమని చెప్పేస్తారు అజిత్ కుమార్. తన ఫోకస్ అంతా మూవీస్ పైనే. ఆ తర్వాత తన హాబీ మాత్రం కారు రేసింగ్. ఈ మధ్యనే మూడుసార్లు తప్పించుకున్నాడు ప్రమాదం నుంచి. అయినా ఊరుకోవడం లేదు.
Ajith-Trisha Movie Vidaamuyarchi in OTT
తిరిగి రేసింగ్ లో ముందుకు సాగుతున్నారు. తాజాగా తను నటించిన విడాముయార్చి(Vidaamuyarchi) మూవీ సక్సెస్ సాధించింది తమిళంలో. రూ. 100 కోట్లు వసూలు చేసింది. మూవీ మేకర్స్ కు సంతృప్తిని కలిగించేలా చేసింది. అయితే తెలుగు వెర్షన్ లో విడాముయార్చి అంతగా ఆకట్టుకోలేక పోయింది.
ఈ మూవీ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టాడు అజిత్ . చర్చలు జరుగుతున్నాయని టాక్. ఇదిలా ఉండగా తను నటించిన విడాముయార్చి చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సినిమాను సినిమా లాగే ప్రేక్షకులు చూడాలని, అభిమానులు కూడా ఓవర్ గా రియాక్ట్ కావద్దంటూ ఆ మధ్యన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో అజిత్. ఆయన అందరి హీరో కంటే భిన్నంగా ఉంటారు. ఎక్కువగా ఇతర విషయాల గురించి పట్టించుకునేందుకు ఆసక్తి చూపడు.
తన చిత్రం ఓటీటీలోకి వచ్చేసిందని, ఆసక్తి కలిగిన వాళ్లు, తనపై అభిమానం కలిగిన వారంతా చూడాలని కోరాడు నటుడు.
Also Read : Nayanthara Shocking Comment :ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను