Hero Ajith Vidaamuyarchi : ఫిబ్ర‌వ‌రి 6న రానున్న అజిత్ ప‌ట్టుద‌ల

త‌మిళంలో విదాముయార్చి

Vidaamuyarchi : త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌తిభ‌కు పెద్ద‌పీట వేస్తారు. క్రియేటివిటీకి అందలం అక్క‌డ‌. టాప్ డైరెక్ట‌ర్స్ ఎక్కువ‌గా సామాజిక సందేశాత్మ‌క చిత్రాల‌ను తీసేందుకు ఇష్ట ప‌డ‌తారు. ఇక న‌టుల గురించి చెప్పాల్సి వ‌స్తే ఒక్కో న‌టుడిది ఒక్కో స్పెషాలిటీ. అందులో ప్ర‌త్యేకించి చెప్పాల్సి వ‌స్తే అజిత్ ఒక‌డు. త‌ను భిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటాడు. వాటిలో లీన‌మై పోతాడు. ఇచ్చిన పాత్ర‌కు న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌ను డైరెక్ట‌ర్స్ యాక్ట‌ర్.

Hero Ajith Vidaamuyarchi Movie Updates

తాజాగా అజిత్ న‌టిస్తున్న చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi). దీనిని తెలుగులో ప‌ట్టుద‌ల పేరుతో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాకు మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా దీనిని ప్ర‌తిష్టాత్మ‌క సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది.

సినిమాకు సంబంధించి ప‌ట్టుద‌ల పేరుతో ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. అజిత్ సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో మ‌రింత అందంగా క‌నిపిస్తుండ‌డం విశేషం. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 6న ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ట్దుద‌ల చిత్రాన్ని రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ద‌ర్శ‌కుడు. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశామ‌న్నాడు.

న‌టుడు అజిత్ సినీ కెరీర్ లోనే ఈ మూవీ మ‌రిచి పోలేని చిత్రంగా ఉండబోతోంద‌ని తెలిపాడు.

Also Read : Beauty Urvashi Rautela : ఊర్వ‌శి రౌటేలా షాకింగ్ కామెంట్స్

Ajith KumarCinemaTrendingUpdatesVidaamayurchi
Comments (0)
Add Comment