Ajith Kumar: అజిత్‌ రియల్‌ స్టంట్స్ కు నెటిజన్లు ఫిదా !

అజిత్‌ రియల్‌ స్టంట్స్ కు నెటిజన్లు ఫిదా !

Ajith Kumar: కోలీవుడ్ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్ కు స్టంట్స్‌ అంటే చాలా ఇష్టం. స్వతహాగా బైక్ రేసర్ గా ఉన్న అజిత్… తన సినిమాల్లో రైడింగ్ సన్నివేసాలను డూప్ లేకుండా నటిస్తారు. గత కొంతకాలంగా ఆయన యాక్షన్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో చాలా రిస్కీ సీన్లను కూడా డూప్ లేకుండా రియల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ కుమార్ మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘విదా ముయార్చి’లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్న స్వయంగా రిస్క్ చేసిన సీన్‌ కు సంబంధించిన ఓ వీడియోను తాజాగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పోస్ట్‌ చేసింది.

Ajith Kumar Stunts Viral

ప్రస్తుతం అజిత్‌ తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’లో నటిస్తున్నారు. గతేడాది నవంబర్‌ లో ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌ లో అజిత్(Ajith Kumar) డూప్‌ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్‌ షేర్‌ చేసింది. సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్‌ ఫాస్ట్‌గా కారు డ్రైవ్‌ చేయాలి. డూప్‌ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపారు. దీనితో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ వీడియోను షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ ‘ ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో..’ అంటూ అజిత్‌పై ప్రశంసలు కురిపించింది. ఇది చూసిన నెటిజన్లు సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Also Read : Trisha : నయనతార రికార్డును సైతం బద్దలు కొట్టిన త్రిష…అందులోనే…

Ajith KumarTrisha Krishnan
Comments (0)
Add Comment