Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయనున్నట్లు మైత్రీమూవీ మేకర్స్ సంస్థ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాల్ ‘మార్క్ ఆంటోనీ’తో మంచి హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్… ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు… దీనికి ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసి పోస్టర్ ను విడుదల చేసింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ సినిమా షూటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైయింది. ఇందుకోసం చిత్ర బృందం ఓ భారీ సెట్ ను సిద్ధం చేసింది. అందులోనే అజిత్ తో పాటు మిగిలిన కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ముస్తాబవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ajith Kumar Movie Updates
ఈ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ… వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. అజిత్(Ajith Kumar), అధిక్ కోలీవుడ్ లో మంచి స్నేహితులు. ‘నేర్కొండ పార్వై’ చిత్రంతో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ‘మార్క్ ఆంటోనీ’ సక్సెస్ మీట్‌లోను అజిత్‌ను గుర్తుచేసుకుంటూ అధిక్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ టైటిల్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
Also Read : Ram Pothineni: వెబ్ సిరీస్ లోనికి మరో టాలీవుడ్ స్టార్ హీరో ?