Ajith Kumar: ఖైదీ నంబర్‌ 63 గా అజిత్ న్యూ లుక్ అదుర్స్ !

ఖైదీ నంబర్‌ 63 గా అజిత్ న్యూ లుక్ అదుర్స్ !

Ajith Kumar: విశాల్‌ ‘మార్క్‌ ఆంటోనీ’తో మంచి హిట్‌ అందుకున్న అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా సినిమా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా ముస్తాబవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ajith Kumar Movie Updates

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి గురువారం రెండో లుక్‌ ను విడుదల చేశారు. అందులో అజిత్‌(Ajith Kumar) ఖైదీ దుస్తుల్లో మాస్‌ స్టైలిష్‌ లుక్‌ లో కనిపించారు. ఆయన చేతిపై ఉన్న టాటూ… తన జేబుపై ఉన్న 63 నంబర్‌… బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తున్న మిషన్‌ గన్స్‌ ఫైరింగ్‌… ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖైదీ నెంబర్ 63గా అజిత్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో అజిత్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు విభిన్న పాత్రల్లో అజిత్ ఎలా ఉండబోతున్నారో ఈ పోస్టర్ ద్వారా అభిమానులకు ఓ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా… మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత రష్యాలో కీలక భాగం షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం అజిత్ కి భారీ పారితోషికం ముట్టచెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ ట్రిపుల్ రోల్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Kalki 2898 AD: ‘కల్కి’ సినిమాపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ !

Ajith KumarGood Bad Uglymytri movies makers
Comments (0)
Add Comment