Hero Ajith-Good Bad Ugly :అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కు రెడీ

ఏప్రిల్ 10న రానున్న ప్రేక్ష‌కుల ముందుకు

Good Bad Ugly : భారీ అంచ‌నాల మ‌ధ్య త‌మిళ సినీ న‌టుడు అజిత్ కుమార్ , సిమ్రాన్, త్రిష కృష్ణ‌న్ క‌లిసి న‌టించిన మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే త‌మిళం, తెలుగులో రిలీజ్ చేసిన ఈ చిత్రం ట్రైల‌ర్స్ కు మంచి స్పంద‌న ల‌భించింది. ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. స్టార్ హీరోయిన్లు ఇందులో కీ రోల్ పోషించ‌డం విశేషం. ఈ మూవీని తెలుగులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు.

Ajith-Good Bad Ugly Movie Updates

మంచి ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ తో ముందుకు వ‌చ్చింది ట్రైల‌ర్. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంది. ముందుగా హీరోతో ప‌లికించాడు ద‌ర్శ‌కుడు. నా కోసం ద‌మ్మును వ‌దిలివేశా. నా భార్య కోసం మందును వ‌దులుకున్నా. హింస‌ను నా కొడుకు కోసం వ‌ద్ద‌నుకున్నా..నా కొడుక్కే స‌మ‌స్య వ‌స్తే ఊరుకుంటానా..ఇర‌గ‌దీస్తా అని చెప్పిన మాట‌లు పేలాయి. ఇందులో అద్భుతంగా న‌టించాడు అజిత్. త‌న‌తో పోటీ ప‌డి న‌టించారు సిమ్రాన్, త్రిష‌. చాలా కాలం త‌ర్వాత సిమ్రాన్ తెర‌పై క‌నిపిస్తోంది.

ఈ ఏడాది అజిత్ న‌టించిన మూవీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. త‌ను గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రానుంది. దీనిపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడు. ఇది త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని భావిస్తున్నాడు హీరో. ఈ మూవీలో త‌న‌తో పాటు అర్జున్ దాస్ , సునీల్ , జాకీ ష్రాఫ్ , ప్రియా ప్ర‌కాశ్ , ప్ర‌భు, ప్ర‌స‌న్న‌, యోగి బాబు, రాహుల్ దేవ్, అవినాష్ ఇత‌ర పాత్ర‌లు పోషిస్తున్నారు. మొత్తంగా త‌న ఫ్యాన్స్ మాత్రం త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Virgin Boys-Comedy Sensational :వ‌ర్జిన్ బాయ్స్ కామెడీ అదుర్స్

Ajith KumarCinemaGood Bad UglyTrendingUpdates
Comments (0)
Add Comment