Good Bad Ugly : తమిళ సినీ హీరో హీరోయిన్లు అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ కీలక పాత్రలు పోషించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలు తోసి రాజని పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 28.5 కోట్ల నికరంగా వసూళ్లను సాధించింది. సినీ వర్గాలను విస్మయ పరిచేలా చేసింది. ఇక అజిత్ సినీ కెరీర్ లో ఈ మూవీ ది బెస్ట్ చిత్రంగా ఉండి పోతుందని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు.
Atith – Trisha Good Bad Ugly Movie
త్రిష, అజిత్ కలిసి నటించిన రెండో చిత్రం ఇది ఈ ఏడాది. గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) చిత్రాన్ని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. యాక్షన్, థ్రిల్లర్ కలిగించేలా జాగ్రత్త పడ్డాడు. ప్రత్యేకించి అజిత్ ను డిఫరెంట్ గా చూపించాడు. భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తోందని సినీ క్రటిక్స్ పేర్కొంటున్నారు.
విచిత్రం ఏమిటంటే అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ కలిసి విదాముయార్చి లో నటించారు. అది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన మేర ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. బిగ్ డిజాస్టర్ గా మిగిలి పోయింది. దీంతో అజిత్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇక త్రిష కృష్ణన్ మాత్రం ఫుల్ జోష్ లో ఉంది. తను వరుస సినిమాలతో బిజీగా ఉంది. దళపతి విజయ్ తో జన నాయగన్ లో, మెగాస్టార్ చిరంజీవితో నటించింది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ కి పాజిటివ్ టాక్ రావడంతో ఫుల్ ఖుష్ లో ఉంది త్రిష కృష్ణన్.
Also Read : Shanti Priya Shocking :నీ జ్ఞాపకం పదిలం..చిరస్మరణీయం