Shaitaan: థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ తో ఆకట్టుకుంటోన్న ‘షైతాన్‌’ ట్రైలర్‌ !

థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ తో ఆకట్టుకుంటోన్న ‘షైతాన్‌’ ట్రైలర్‌ !

Shaitaan: బాలీవుడ్ స్టార్ మీరో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘షైతాన్(Shaitaan)’. వికాస్ బెహల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 08న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. జియో స్టూడియోస్‌‌ సమర్పణలో అజయ్ దేవగన్‌‌, జ్యోతి దేశ్‌‌పాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాను సంయ‌క్తంగా నిర్మిస్తున్నారు. గుజరాతీ హారర్ థ్రిల్లర్ ‘వష్’ సినిమాకు రీమేక్‌ గా ఈ ‘షైతాన్’ వ‌స్తుంది.ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల‌ నుండి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ‘షైతాన్’ సినిమాకు సంబంధించి విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటోంది. వశీకరణకు గురైన తన కూతురిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులుగా అజయ్‌, జ్యోతిక కనిపిస్తున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

Shaitaan – ట్రైలర్ ఎలా ఉందంటే ?

సరదాగా సాగిపోతున్న కబీర్‌ (అజయ్‌) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. దాంతో వారు ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారన్న అంశాలు, ఆసక్తికర సన్నివేశాలతో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘‘ఆయన బలవంతంగా మా ఇంట్లోకి వచ్చేశాడు. అతను నా కూతురిని చంపేస్తాడు. దయచేసి ఆమెను కాపాడండి’’ అంటూ జ్యోతిక తన కుమార్తెను రక్షించడానికి పరితపిస్తోంది. మరి ఆమె ఎందుకిలా మాట్లాడుతుంది ? తన కుమార్తెను చంపాలనుకున్న వ్యక్తి ఎవరు ? అనేది తెలియాలంటే ‘షైతాన్‌’ చూడాల్సిందే అంటున్నాయి సినీవర్గాలు. ‘‘మీ కూతురు ఇప్పుడు నా కీలుబొమ్మ. ఆమెకు నేనే దేవుడిని’, ‘నా కూతురిని, కుటుంబాన్ని ఎలాగైనా కాపాడుకుంటాను’’ లాంటి సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్‌. వశీకరణకు గురైన తన కూతురిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులుగా అజయ్‌, జ్యోతిక కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘తన వాళ్ల కోసం రాక్షసుడిని సైతం ఢీకొట్ట గల శక్తి కేవలం అమ్మకు మాత్రమే సొంతం’ లాంటి వ్యాఖ్యలతో ఇటీవల విడుదల చేసిన పోస్టర్ సినీప్రియుల దృష్టిని ఆకర్షించాయి.

Also Read : Ambajipeta Marriage Band : ఆ ఓటీటీలో రాబోతున్న “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా

ajay devaganJyothikaR MadhavanShaitaan
Comments (0)
Add Comment