Ajay Bhupathi: ఉత్తమ దర్శకుడిగా అజయ్‌ భూపతి !

ఉత్తమ దర్శకుడిగా అజయ్‌ భూపతి !

Ajay Bhupathi: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్‌ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘మంగళవారం’. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నందిత శ్వేత, అజయ్ ఘోష్, అజ్మల్, దివ్య పిళ్లై ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య గతేడాది నవంబరు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. డిసెంబర్ లో డిస్నీహాట్ స్టార్ లో రిలీజైన ‘మంగళవారం’ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.

అయితే ‘మంగళవారం’ సినిమాకు గాను అజయ్ భూపతి(Ajay Bhupathi) ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. 8వ ‘ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ లో ‘మంగళవారం’ సినిమాకి గాను ఆయన ఈ పురస్కారం దక్కించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తంచేశారు. జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘మినీ బాక్సాఫీస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌’లో ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఒకటి.

‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా విశేష క్రేజ్‌ సొంతం చేసుకున్న అజయ్‌(Ajay Bhupathi)… రెండో సినిమా ‘మహాసముద్రం’తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. మూడో చిత్రం ‘మంగళవారం’తో మరోసారి తన సత్తా చాటారు. గోదావరి జిల్లాలోని ఓ గ్రామం చుట్టూ అల్లుకున్న ఈ కథలో పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్ర పోషించారు. శైలు పాత్రలో ఒదిగిపోయి, ప్రశంసలు పొందారు. ఈ సినిమాకు ‘జైపుర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఉత్తమ నటి, బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌, బెస్ట్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది.

Ajay Bhupathi – ‘మంగళవారం’ కథేమిటంటే !

మ‌హాల‌క్ష్మీపురంలో గ్రామ దేవ‌త మాల‌చ్చ‌మ్మ‌కి ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజున‌ వ‌రుస‌గా రెండు జంట‌ల‌ ప్రాణాలు గాల్లో క‌లిసి పోతాయి. అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఊరి గోడల‌పై రాసిన రాత‌ల వ‌ల్లే వాళ్లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డి ఉంటార‌ని గ్రామ‌స్తులంతా న‌మ్ముతారు. కానీ, ఆ ఊరికి కొత్త‌గా వ‌చ్చిన ఎస్సై మాయ (నందిత శ్వేత‌) మాత్రం అవి ఆత్మ‌హ‌త్య‌లు కావు హ‌త్య‌ల‌ని బ‌లంగా న‌మ్ముతుంది. అది నిరూపించేందుకు ఆ శ‌వాల‌కు పోస్ట్‌మార్టం చేయించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఊరి జ‌మిందారు ప్ర‌కాశం బాబు (చైత‌న్య కృష్ణ‌) అడ్డు చెబుతాడు. అత‌ని మాట‌కు ఊరు కూడా వంత పాడ‌టంతో మొద‌టిసారి త‌న ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకుంటుంది.

కానీ, రెండో జంట చ‌నిపోయిన‌ప్పుడు మాత్రం ఊరి వాళ్ల‌ను ఎదిరించి మ‌రీ పోస్టుమార్టం చేయిస్తుంది. మ‌రోవైపు ఊరి వాళ్లు గోడ‌ల‌పై రాత‌లు రాస్తున్న అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రో క‌నిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు. మ‌రి ఊర్లో జ‌రిగిన‌వి ఆత్మ‌హ‌త్య‌లా? హ‌త్య‌లా? ఈ చావుల వెన‌కున్న ల‌క్ష్యం ఏంటి?వీటికి ఆ ఊరి నుంచి వెలివేయ‌బ‌డ్డ శైల‌జ అలియాస్ శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌)కు ఉన్న సంబంధం ఏంటి? అస‌లు ఆమె క‌థేంటి? ఊర్లో జ‌రిగే చావులకు ఫొటోగ్రాఫ‌ర్ వాసు (శ్ర‌వ‌ణ్ రెడ్డి), డాక్ట‌ర్ (ర‌వీంద్ర విజ‌య్), జ‌మిందారుకు.. అత‌ని భార్య (దివ్యా పిళ్లై)కు ఏమైనా సంబంధం ఉందా? శైలు చిన్న‌నాటి ప్రియుడు ర‌వి క‌థేంటి? అన్న‌ ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు అజయ్ భూపతి.

Also Read : Prabhas Gift : డార్లింగ్ ప్రభాస్ కు స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి భార్య

Ajay BhupathiMangalavaaramPayal Rajput
Comments (0)
Add Comment