Aishwarya Rajesh: గ్లామర్ డోస్ పెంచిన ఐశ్వర్య రాజేష్ !

గ్లామర్ డోస్ పెంచిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh: దక్షిణాది భాషల్లో ప్రతి ఒక్కరికీ బాగా పరిచయమున్న హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌. కెరీర్‌ ఆరంభంలో హోమ్లీ గర్ల్‌ గా ముద్ర వేసుకున్న ఈమె… ఇపుడు కాస్తా గ్లామర్‌ డోస్‌ పెంచి ప్రతి ఒక్కరినీ ఆశ్చపరుస్తున్నారు. ఇటీవలికాలంలో ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది. ఈ మధ్య ఆమె స్పెషల్‌ ఫొటో షూట్‌ల పేరుతో ఎక్స్‌ పోజ్‌ చేస్తూ, సోషల్‌ మీడియాలో ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. దీనితో సినీ ప్రేక్షకులే కాదు ఆమె ఫ్యాన్స్‌ సైతం ఆశ్చర్యపోతున్నారు.

Aishwarya Rajesh…

పా. రంజిత్‌ దర్శకత్వంలో 2011లో వచ్చిన ‘అట్టకత్తి’ సినిమాలో ఒక మంచి పాత్ర ద్వారా ఐశ్వర్య రాజేష్‌(Aishwarya Rajesh) వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘పుత్తగం’ సినిమాలో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చారు. ‘రమ్మి’ సినిమాలో విజయ్‌ సేతుపతి సరసన నటించారు. అయితే ‘కాక్కాముట్టై’ సినిమా ఆమె సినీ కెరీర్‌కు ఓ టర్నింగ్‌ పాయింట్‌లా నిలిచింది. ఫలితంగా కోలీవుడ్‌ సరిహద్దులను దాటి తెలుగు, మలయాళ భాషల్లో కూడా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.

ఈ మధ్య లేడీ ఓరియంటెడ్‌ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘ఫర్హానా’లో ఆమె ఒక ముస్లిం గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా పోషించిన పాత్రకు ప్రశంసలు వచ్చాయి. సినిమాలే కాకుండా ఐశ్వర్య రాజేష్‌(Aishwarya Rajesh) సోషల్‌ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన తాజా ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడూ కూడా లిమిట్ దాటింది లేదు. కానీ ఇటీవలికాలంలో ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది. ఈ మధ్య ఆమె స్పెషల్‌ ఫొటో షూట్‌ల పేరుతో ఎక్స్‌పోజ్‌ చేస్తూ, సోషల్‌ మీడియాలో ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. దీంతో సినీ ప్రేక్షకులే కాదు ఆమె ఫ్యాన్స్‌ సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఎందుకంటే, ఇప్పటి వరకు ఆమె హోమ్లీ గర్ల్‌ గానే కనిపించింది. ప్రేక్షకులు కూడా ఆమెను అలాగే ఇష్టపడుతూ వచ్చారు. కానీ, ఒక్కసారిగా ఇలా గ్లామర్ టచ్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్సే కాదు, నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి కాంపిటేషన్‌ లో తనూ ఉండాలని అనుకుంటుందో, లేదంటే గ్లామర్ టచ్ ఇవ్వకుంటే అవకాశాలు రావని అనుకుంటుందో తెలియదు కానీ… తను కూడా ఎక్స్‌పోజింగ్‌కు రెడీ అన్నట్లుగా సిగ్నల్స్ పంపుతుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హోమ్లీని పక్కనెట్టి గ్లామర్‌ని నమ్ముకుంటున్న ఈ భామకు ముందు ముందు ఎలాంటి అవకాశాలు వరిస్తాయో చూడాలి.

Also Read : Sonali Bendre: ‘మురారి’ సినిమా రీ రిలీజ్‌ పై హీరోయిన్ సోనాలి బింద్రే ఆశక్తికరమైన పోస్ట్ !

Aishwarya RajeshPa RanjithVijay Sethupathi
Comments (0)
Add Comment