మణిరత్నం పుణ్యమా అని ఐశ్వర్య రాయ్ సినిమా రంగానికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ బచ్చన్ వెను దిరిగి చూడలేదు. సుభాష్ ఘాయ్ తీసిన తాళ్ తన చరిత్రే తిరగ రాసేలా చేసింది. భారత దేశ సినీ చరిత్రలో ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రపంచ సంగీత దిగ్గజం అల్లా రఖా రెహమాన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.
ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించింది. సల్మాన్ ఖాన్ తో నటించిన హమ్ దిల్ చుకే సనమ్ లో లీనమైంది. సల్మాన్ ప్రేమలో పడింది. కానీ పెళ్లి దాకా వెళ్లలేక పోయింది. చివరకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలైంది. తన తనయుడు అభిషేక్ బచ్చన్ తో బంధం పెంచుకుంది.
ఐశ్వర్య రాయ్ బచ్చన్ పుట్టిన రోజు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో అభిమానులను పొందింది ఈ సోగకళ్ల సుందరి. బాలీవుడ్ లో రేఖ, మాధురీ దీక్షిత్ తో పాటు ఐశ్యర్వ రాయ్ బచ్చన్ తట్టుకుని నిలబడింది. విశ్వ సుందరిగా ఎంపికైన ఈ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే.
వయసు పెరిగే కొద్దీ అందం తగ్గి పోతుంటుంది. కానీ ఐశ్వర్య విషయంలో మాత్రం అలా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న హీరోయిన్లతో పోటీ పడి నటిస్తోంది ఐశ్వర్య రాయ్ బచ్చన్.