Aishwarya Rai : వారిపై వస్తున్న విడాకుల రూమర్స్ కి స్పందించిన అభిషేక్

అభిషేక్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది...

Aishwarya Rai : బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి. 2007లో ప్రేమించి వివాహం చేసుకున్నారీ లవ్లీ కపుల్. 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. ఎంతో అనోన్యంగా ఉండే ఈ అందమైన జంట విడిపోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై ఐష్ కానీ, అభిషేక్ కానీ ఎవరూ స్పందించడం లేదు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి కూడా విడివిడిగా హాజరయ్యారు ఐశ్వర్య(Aishwarya Rai), అభిషేక్. దీంతో వీరి విడాకుల వార్తలు మళ్లీ తెరమీదకు వచ్చాయి.

తాజాగా అభిషేక్‌(Abhishek Bachchan)కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఎట్టకేలకు నోరు విప్పాడు అభిషేక్. ఐశ్వర్యతో వస్తోన్న విడాకాల రూమర్స్‌పై తన దైన శైలిలో స్పందించాడు. ‘ నేను దీని గురించి చెప్పడానికి మీరుఏమీ మిగల్చలేదు. మీరందరూ ఇప్పటికే ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్‌ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేం సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటాం. నాకు పెళ్లయింది క్షమించండి’ అంటూ తన తన ఉంగరాన్ని చూపించాడు అభిషేక్. తద్వారా తమపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్ పెట్టాడీ బాలీవుడ్ హీరో.

Aishwarya Rai…

అభిషేక్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో కొత్తదా? పాతదా అనేది మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల ప్రముఖ రచయిత్రి హీనా ఖండేవాలా ఒక పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ విడాకుల గురించి. దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘ విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదు’ అని. దీనికి అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అభిషేక్ జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందని చాలా మంది భావించారు. ఇలా అభిషేక్- ఐశ్వర్యల బంధంపై రూమర్లు రావడం ఈ మధ్యన పరిపాటిగా మారింది.

Also Read : Biju Menon: శివ కార్తికేయన్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ !

Abhishek BachchanAishwarya RaiCommentsViral
Comments (0)
Add Comment