Aishwarya Lekshmi : తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసిన నటి ఐశ్వర్య లక్ష్మి

ఇక క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ తన మొదటి క్రష్‌ అని తెలిపిన ఐశ్వర్య....

Aishwarya Lekshmi : మలయాళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lekshmi). ఆ తర్వాత గాడ్సే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది పొన్నియన్‌ సెల్వన్‌ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు సంపాదించుకుంటున్న ఈ చిన్నది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాట్లాడుతూ.. మొదటి తాను డాక్టర్‌ అవ్వాలనుకున్నాని, ఎంబీబీఎస్‌ చదవడానికి కొచ్చి వెళ్లాలనని, కానీ అనుకోకుండా యాక్టర్‌ అయ్యానని చెప్పుకొచ్చింది. ఫైనల్‌ ఇయర్‌ ఎగ్జామ్‌ రిజల్ట్‌ రావడానికి రెండు రోజుల ముందు, హీరోయిన్‌ కోసం ఓ పేపర్‌లో ప్రకటన చూశాను. నా ఫోటోను ఆ చిరునామాకు పంపాను. అలా మొదటి అవకాశం వచ్చిందని ఐశ్వర్య తెలిపింది.

Aishwarya Lekshmi Comments

ఇక క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ తన మొదటి క్రష్‌ అని తెలిపిన ఐశ్వర్య(Aishwarya Lekshmi).. టీనేజ్‌లో యువరాజ్‌ అంటే చాలా ఇష్టపడేదానని, ఆ తర్వాత క్రికెట్‌ చూసే సమయం లేదని తెలిపింది. సినిమాల్లో అభిషేక్‌ బచ్చన్‌, విజయ్‌ దళపతి అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని తెలిపిన ఐశ్వర్య.. జీవితంలో ఎప్పటికీ పెండ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది.

తాను ఈ నిర్ణయాన్ని ఎంతో ఆలోచించి తీసుకున్నానని తెలిపింది. అయితే ఒకప్పుడు.. గురువాయూర్‌ గుడిలో జరిగే పెళ్లిళ్లు చూసి తనకు కూడా పెళ్లి చేసుకోవాలని అనిపించిందంటా. ఇందులో భాగంగా గతంలో తన ప్రొఫైల్‌ ఓ మ్యాట్రిమోనీలో కూడా పెట్టానని తెలిపింది. అయితే ఇప్పుడు తనకు తెలిసిన చాలామందిలో ఒకటి రెండు జంటలు తప్పితే అందరూ రాజీపడి బతుకుతున్నారని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. చాలా మంది వివాహం వల్ల వ్యక్తిగతంగా ఎదగలేకపోతున్నారని, వివాహంపై తన అభిప్రాయం మారిందన్న ఐశ్వర్య, అందుకే నేను ఎప్పటికీ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాని తేల్చి చెప్పింది. మరి ఐశ్వర్య ఇదే మాటపై ఉంటుందా.? పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందా చూడాలి.

Also Read : Sunny Leone : సన్నీ లియోన్ పై అలిగిన హైదరాబాద్ అభిమానులు

Aishwarya LekshmiCommentsViral
Comments (0)
Add Comment