Aishwarya Lekshmi: ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి… తమ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్(Sai Durgha Tej) హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్ కెపి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.
Aishwarya Lekshmi Movie Updates
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ స్ట్రాంగ్ కంటెంట్ సబ్జెక్ట్ లను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళుతున్నారు. ఆయన ఇటీవల నటించిన విరూపాక్ష, బ్రో చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ చిత్రాలుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన మరో సరికొత్త కంటెంట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను రోహిత్ కెపి దర్శకత్వంలో.. ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి.. తమ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని నిర్మాతలు హై బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ సరసన నటించే హీరోయిన్‌ని మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో సాయి దుర్గా తేజ్ సరసన నటించడానికి మోస్ట్ ట్యాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi) ని ఎంపిక చేశారు. ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా వసంతగా ఆమె క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ఎడారి లాంటి ల్యాండ్‌స్కేప్‌లో సెట్ చేసిన పోస్టర్‌లో ఐశ్వర్య లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఆర్‌ఎఫ్‌సీలో వేసిన మ్యాసీవ్ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గా తేజ్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన సరికొత్తగా మేకోవర్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
Also Read : Nithin: తండ్రిగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ !