Trisha Krishnan: నటి త్రిషపై అన్నా-డిఎంకే పార్టీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు !

నటి త్రిషపై అన్నా-డిఎంకే పార్టీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు !

Trisha Krishnan: దక్షిణాది సినిమా పరిశ్రమ అగ్రతార త్రిషపై అన్నా-డిఎంకే పార్టీ నాయకుడు ఏవీ రాజు సంచలన కామెంట్స్ చేసారు. ఇటీవల ఓ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు కలిసి రూ. 25 లక్షలు చెల్లించి త్రిషను… రిసార్ట్ కు పిలిపిచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు తమిళనాట మరో వివాదానికి కారణమైంది. ఇటీవల లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేకపోవడం వలన నిరాశకు గురయ్యానని నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపాయి. దీనితో మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండించడంతో పాటు, జాతీయ మహిళా కమీషన్ సీరియస్ గా స్పందించింది. ఈ నేపథ్యంలో మన్సూర్… త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు మద్రాస్ కోర్టు నుండి చివాట్లు కూడా తినాల్సి వచ్చింది. అయితే ఈ వివాదం సద్దుమణిగిందనేలోపు మరో వివాదం త్రిషను, తమిళనాడు సినీ పరిశ్రమను చుట్టుముట్టుంది.

Trisha Krishnan Got Shocking Comments

అన్నా-డీఎంకే నాయ‌కుడు ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలపై త్రిష స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. ప్ర‌జ‌ల దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా దిగజారిపోతున్న‌ నీచమైన మనుషులను ప్రతిసారి చూడటం అసహ్యంగా ఉందన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఉపేక్షించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటానని, ఇక అంతా మా లీగ‌ల్ టీమ్ చూసుకుంటుంద‌ని, చెప్పాల్సింది, చేయాల్సింది అంతా వారే చూసుకుంటార‌ని పేర్కొంటూ త్రిష(Trisha Krishnan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ సమస్య ఎంత దూరం వెళుతుందో చూడాలి.

త్రిషపై అన్నా-డిఎంకే నాయకుడు ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలపై నటుడు విశాల్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఓ సినిమా నటిపై తీవ్ర అసభ్యకరంగా కామెంట్లు చేయడం ఏ మాత్రం అమోదయోగ్యం కావని ఖండించాడు. ప్రభుత్వం వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరుతూ అన్నా-డిఎంకే నాయకుడు ఏవీ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Virat Anushka: మగబిడ్డకు జన్మనిచ్చిన విరాట్‌- అనుష్క దంపతులు !

AIDMKTrisha Krishnanvishal
Comments (0)
Add Comment