Vijayashanti : ఢిల్లీ – ఎవరూ ఊహించని రీతిలో ప్రముఖ నటి, రాములమ్మగా పిలుచుకునే విజయశాంతికి(Vijayashanti) అనూహ్యంగా ఎమ్మెల్సీ ఛాన్స్ లభించింది. తాజాగా ఏఐసీసీ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారికంగా పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసినట్లు వెల్లడించారు కేసీ. నామినేషన్లు వేసేందుకు రేపే చివరి తేదీ.
Vijayashanti As a Congress MLC
సంఖ్యా బలానికి అనుగుణంగా నలుగురికి ఛాన్స్ దక్కాల్సి ఉండగా చివరకు మిత్రపక్షంగా ఉన్న సీపీఐకి ఒక సీటు కేటాయించింది. ఇదే సమయంలో గత కొంత కాలంగా పార్టీ కోసం పని చేస్తూ వస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ తో పాటు నల్లగొండ జిల్లా పీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కు అవకాశం దక్కింది.
ఇదే సమయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఐరన్ లేడీగా, లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు పొందారు విజయశాంతి. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఊహించని రీతిలో బీజేపీలోకి వెళ్లారు. అక్కడ తనకు గుర్తింపు దక్కక పోవడంతో తిరిగి హస్తం వైపు చూశారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తాను స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత మౌనంగా, దూరంగా ఉన్నారు.
తాజాగా రాష్ట్రానికి నూతన ఇంచార్జ్ గా నియమితులైన మీనాక్షి నటరాజన్ రాకతో ఒక్కసారిగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. చివరకు మహిళ కోటాలో విజయశాంతికి సీటు ఖరారు చేయాలని సూచించారు. దీంతో హైకమాండ్ ఆమె వైపు మొగ్గింది.
Also Read : Hero Venkatesh-Mahesh SVSC Re-Release:సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రికార్డ్