CEO Archana Appreciates Pradeep :ప్ర‌దీప్ గొప్ప న‌టుడే కాదు మ‌న‌సున్నోడు

సినీ నిర్మాత ..ఏజీఎస్ సీఈవో అర్చ‌న క‌ల్ప‌తి

Pradeep : ఏజీఎస్ ఎంట‌ర్టైన్మెంట్ సంస్థ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌మిళ‌నాట పేరు పొందిన చిత్ర‌, నిర్మాణ‌, డిస్ట్రిబ్యూష‌న్, మ‌ల్టీ ప్లెక్స్ ల‌ను క‌లిగిన సంస్థ. 1.16 బిలియ‌న్ల ఆదాయం క‌లిగిన సంస్థ‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా ఉన్నారు అర్చ‌న క‌ల్ప‌తి. ప్ర‌స్తుతం ఆమె సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. త‌మ సంస్థ త‌రపున అత్యంత విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు. అందులో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన గోట్ ఉంది.

CEO Archana Appreciates Pradeep

తాజాగా మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌దీప్ రంగ‌రాజ‌న్(Pradeep), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, కయాదు లోహ‌ర్ క‌లిసి న‌టించిన డ్రాగ‌న్ కు అన్నీ తానే అయి వ్య‌వ‌హ‌రించింది. ఈ సినిమా ఖ‌ర్చు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ ఊహించ‌ని రీతిలో, సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. విడుద‌లైన 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది.

ఈ సంర‌ద్బంగా విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది సినిమా బృందం . ఏజీఎస్ సంస్థ సీఈవో అర్చ‌న క‌ల్పతి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. కొంద‌రికి స్టార్ డ‌మ్ అనేది అలంకారం. కానీ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ మాత్రం ఎంత ఎత్తుకు ఎదిగినా అణుకువ‌గా ఉంటాడు. త‌ను అద్భుత‌మైన న‌టుడే కాదు ర‌చ‌యిత‌, మంచి మ‌న‌సు క‌లిగిన వ్య‌క్తి అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

త‌న‌తో పాటు ద‌ర్శ‌కుడికి మంచి భ‌విష్య‌త్తు ఉంది. ఎప్ప‌టికీ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ కోసం ఎంత ఖ‌ర్చు పెట్టేందుకైనా సిద్దంగా ఉన్నామంటూ ప్ర‌క‌టించారు అర్చ‌న క‌ల్ప‌తి. ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటార‌నే దానిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు. త‌న‌కు ముందు నుంచీ డ్రాగ‌న్ సినిమా త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉండేద‌ని, కానీ ఇంత‌లా బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తార‌ని అనుకోలేద‌న్నారు .

Also Read : CM Siddaramaiah Shocking :సినీ మల్టీప్లెక్స్‌లలో టికెట్ల ధ‌ర‌లు త‌గ్గింపు

CommentsPradeep RanganathanViral
Comments (0)
Add Comment