Alia Bhatt : పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్ తగ్గకుండా భారీ రెమ్యూనరేషన్ తో దూసుకుపోతున్న భామ

హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించిన మెప్పించింది అలియా భట్...

Alia Bhatt : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింద. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో హిందీలో వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించిన మెప్పించింది అలియా భట్(Alia Bhatt). గంగూబాయి కతియవాడి సినిమాలో తన నటనకు ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. అలాగే డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్షిణాది సినీప్రియులను అలరించింది.

Alia Bhatt…

అలియాభట్ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.18 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా కోసం $500,000 పారితోషికం తీసుకుంది. నివేదికల ప్రకారం అలియా ఆస్తులు రూ.550 కోట్లకు పైగానే ఉంటుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్ వెంచర్‌ల ద్వారా సంపాదిస్తుంది. అటు వ్యాపారరంగంలోనూ దూసుకుపోతుంది. చిన్న పిల్లల దుస్తులు బ్రాండ్ ఎడ్ ఎ మమ్మను 2020లో స్థాపించింది. ఈ బిజినెస్ విలువ రూ.150 కోట్లు. అలాగే సొంతంగా ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థ కూడా కలిగి ఉంది. ముంబై, లండన్ లో ఖరీదైన భవనాలు ఉన్నాయి. BMW , రేంజ్ రోవర్‌తో సహా హై-ఎండ్ కార్లను కూడా కలిగి ఉంది అలియా.

Also Read : Vijay Deverakonda : తన లవ్ స్టోరీ పై వస్తున్న రూమర్స్ కి స్పందిస్తూ కొంత ప్రైవసీ కోరిన విజయ్

Alia BhattTrendingUpdatesViral
Comments (0)
Add Comment