Rajadhi Raja : తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నటుడు తలైవా రజనీకాంత్. ఇప్పుడు తను గతంలో నటించిన హిట్ మూవీస్ ను తిరిగి రీ రిలీజ్ చేయడం, ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. తాజాగా రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నాడు. తను కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ చూశానని, బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని జోష్యం చెప్పాడు నటుడు సందీప్ కిషన్.
Rajinikanth Rajadhi Raja in OTT
ఇదే సమయంలో రజనీకాంత్ సినిమాలకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే తను, రాధ కలిసి 36 సంవత్సరాల కిందట నటించిన చిత్రం రాజాధి రాజా(Rajadhi Raja) ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో తలైవా ఫ్యాన్స్ తెగ సంతోషానికి లోనవుతున్నారు.
తమిళంలో 1989లో భారీ స్క్రీన్లలోకి వచ్చింది తమిళ యాక్షన్, కామెడీ చిత్రం రాజాధి రాజా. ఈ సినిమాకు ఆర్. సుందర రాజన్ దర్శకత్వం వహించారు. రాధతో కలిసి ద్విపాత్రాభినయం చేశారు రజనీకాంత్. ఇది పూర్తిగా మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందించాడు డైరెక్టర్.
తాజాగా రజనీకాంత్ నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తలైవా అభిమానులు, ప్రేమికులు దీనిని ఆదరిస్తారని ఆశిద్దాం.
Also Read : Hero Karthi-Sardar 2 :సర్దార్ 2 షూటింగ్ లో కార్తీ కాలికి గాయం