Adivi Sesh: క్షణం, గుఢచారి, ఎవరు, మేజర్, హిట్-2 వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్న నటుడు అడివి శేష్. 2002లో ‘సొంతం’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటికీ… 2011లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత బాహుబలితో ప్రేక్షకులకు దగ్గరయిన అడివి శేష్… ఆ తరువాత క్షణం, గుఢచారి, ఎవరు, మేజర్ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Adivi Sesh – ‘గూఢచారి’ కు సీక్వెల్ గా ‘జీ 2’
2018లో అడివి శేష్ నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. దీనితో ‘గూఢచారి’ కు సీక్వెల్ గా ‘జీ 2’ ను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. వినయ్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనితో ‘జీ 2’ అప్‌డేట్‌లు ఇవ్వమంటూ నెటిజన్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్.. అడివి శేష్‌ను ట్యాగ్ చేస్తూ ‘‘అన్నా ‘గూఢచారి’ గురించి అప్‌డేట్ ఇస్తావా లేదా? అప్‌డేట్ ఇవ్వకపోతే నీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తా’’ అని ట్వీట్ చేశాడు.
నెటిజన్ ట్వీట్ పై ఫన్నీగా స్పందించిన అడివి శేష్
నెటిజన్ ట్వీట్ పై ఫన్నీగా స్పందించిన అడివి శేష్… ‘‘హ్హహ్హహ్హ… లవ్ యూ బ్రదర్. ‘జి 2’ను అద్భుతమైన స్పై ఫిల్మ్ తీర్చిదిద్దడానికి అదే స్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టే ఇంత సమయం తీసుకోవాల్సి వస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతాం’’ అని తెలిపారు. ఇది ఇలా ఉండగా ‘జి 2’కు అడివిశేష్(Adivi Sesh) స్వయంగా కథ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను దాదాపు ఐదు దేశాల్లో ఈ సినిమా షూట్ చేయనున్నారు. అడివి శేష్ సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్న ఈ సినిమాలో బనితా సంధు కథానాయికగా నటిస్తున్నారు.
Also Read : Nani: సినిమానే ఆక్సిజన్ అంటున్న ‘నాని’