Aditya Roy Kapur: గ్లామర్ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, సహజీవనం, విడాకులు చాలా సర్వసాధారణమైపోయాయి. స్నేహంతో మొదలైన కొన్ని జంటలు ప్రేమలో మునిగి తెలి కొంతమంది పెళ్లి పీటలెక్కితే… మరికొంతమంది మాత్రం సహజీవనం చేసి బ్రేకప్ చెప్పుకుంటున్నాయి. పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే జంటలు కూడా చివరి నిమిషంలో బ్రేకప్ చెప్పి విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇలా బ్రేకప్ చెప్పుకునే జాబితాలో తాజాగా బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్(Aditya Roy Kapur) ఉన్నట్లు బీటౌన్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Aditya Roy Kapur Love Stories
గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న అనన్యపాండే, ఆదిత్యరాయ్ కపూర్ లు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించలేదు. ఇంతలో ఆదిత్య రాయ్ కపూర్ మరో హీరోయిన్ తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సారా అలీ ఖాన్ తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్ ఢిల్లీ అనే సినిమా సెట్స్ లో డైరెక్టర్ అనురాగ్ బసు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. బ్రేకప్ చెప్పిన కొద్ది రోజులకే మరో హీరోయిన్ తో పార్టీ చేసుకుంటున్నాడంటూ ఆదిత్యరాయ్ కపూర్ పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని మరికొందరు అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్‌తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు.
Also Read : Geethanjali Malli Vachindi : ఓటీటీలో అలరిస్తున్న అంజలి నటించిన ‘గీతాంజలి మల్లి వచ్చింది’