Beauty Aditi Shankar : ‘ప్రేమిస్తావా’ అంటున్న అదితి శంక‌ర్

30న తెలుగులో మూవీ విడుద‌ల

Aditi Shankar : భార‌తీయ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందిన శంక‌ర్ ముద్దుల కూతురు అదితి శంక‌ర్(Aditi Shankar) ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారింది. త‌ను టాలీవుడ్ లో భైర‌వం చిత్రంలో ప‌ల్లెటూరి పిల్లగా అలరించేందుకు సిద్ద‌మైంది. తాజాగా త‌ను త‌మిళంలో న‌టించిన నేసిప్పాయా మూవీ ఇటీవ‌లే విడుద‌లై అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌తి చోటా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది ఈ చిత్రానికి.

Aditi Shankar Comment

ఈ సినిమాకు సంబంధించి మూవీ మేక‌ర్స్ కీల‌క అప్ డేట్ ఇచ్చారు. పూర్తి యాక్ష‌న్, రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు పంజా ఫేమ్ విష్ణు వ‌ర్ద‌న్. త‌మిళంలో బిగ్ హిట్ అందుకోవ‌డంతో దీనిని తెలుగులో ప్రేమిస్తావా అనే పేరును ఖ‌రారు చేశారు.

తెలుగు వెర్ష‌న్ కు సంబంధించిన మూవీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అంద‌మైన ప్రేమ క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌కు త‌నే సాటి అని నిరూపించుకున్నాడు డైరెక్ట‌ర్ మ‌రోసారి.

జ‌న‌వ‌రి 30వ తేదీన ప్రేమిస్తావా విడుద‌ల కానుంది. ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ముఖంలో ఎంతో అమాయ‌క‌త్వం ఉట్టి ప‌డేలా ఉండే అదితి శంక‌ర్ ఇందులో అద్భుతంగా న‌టించింద‌న్న టాక్ స్వంతం చేసుకుంది. మొత్తంగా తండ్రికి త‌నయురాల‌ని నిరూపించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Also Read : Hero Mahesh-Priyanka : ప్రిన్స్ స‌ర‌స‌న ప్రియాంకేనా

Aditi ShankarCommentsViral
Comments (0)
Add Comment