Aditi Shankar: టాలీవుడ్‌ వైపు శంకర్‌ కుమార్తె అదితి శంకర్ చూపు !

టాలీవుడ్‌ వైపు శంకర్‌ కుమార్తె అదితి శంకర్ చూపు !

Aditi Shankar: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అదితి శంకర్‌ హీరోయిన్‌ గా పలు తమిళ చిత్రాల్లో నటించారు. ఇపుడు టాలీవుడ్‌వైపు ఆమె దృష్టి సారించారు. తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయుకుడిగా తెరకెక్కే చిత్రంలో అదితిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌ సమాచారం. అదితి ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. వైద్య విద్యను అభ్యసించిన అదితి శంకర్‌(Aditi Shankar)… హీరో కార్తీ నటించిన ‘విరుమన్‌’ ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు.

Aditi Shankar Movie…

ఆ తర్వాత శివకార్తికేయన్‌ నటించిన ‘మావీరన్‌’లో నటించారు. ప్రస్తుతం ఆమె విష్ణువర్థన్‌ దర్శకత్వంలో ఆకాష్‌ మురళి హీరోగా నటించే ‘నేసిప్పాయా’ సినిమాలో నటించారు. ఆ తర్వాత అర్జున్‌ దాస్‌ హీరోగా నటించే మరో చిత్రంలో కూడా ఆమె నటించనున్నారు. ఇపుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడగల అదితిని టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆదరిస్తారని కోలీవుడ్ సైతం భావిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘గేమ్ చేంజర్’ చిత్రంలోనూ ఓ పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో టాలీవుడ్‌లో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌ లో ఆమె చేసిన డ్యాన్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే కార్తీ, శివకార్తికేయన్ చిత్రాలు తెలుగులోనూ విడుదలవడంతో… తెలుగు ప్రేక్షకులకు ఆమె ఇప్పటికే పరిచయమై ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్‌ గా బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న అదితి శంకర్… ఏ మేరకు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటుందో.. వెయిట్ అండ్ సీ. అయితే అదితి తెలుగు సినిమాలో చేసే విషయమై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Also Read : Sonakshi Sinha: మతాంతర వివాహాంపై ఎదుర్కొన్న ట్రోల్స్ కు ఒక్క వీడియోతో సమాధానం చెప్పిన సోనాక్షి !

Aditi ShankarBellamkonda Sreenivas
Comments (0)
Add Comment