Robinhood : నితిన్ రెడ్డి, లవ్లీ బ్యూటీ శ్రీలీల(Sreeleela) కలిసి నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా మూవీ మేకర్స్ స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు. దుమ్ము రేపుతోంది సోషల్ మీడియాను. ఇప్పటికే శ్రీలీల డ్యాన్స్ తో ఇరగదీసింది. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.
Robinhood Movie Special Song
రాబిన్ హుడ్ కు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ ఎత్తున ఖర్చు చేశారు. తాజాగా మూడవ సింగిల్ అధి ధా సర్ ప్రిసు ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తుండడం విశేషం. ఇందులో శ్రీలీల చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం రిలీజ్ చేసిన సాంగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కేతిక శర్మ. రాబిన్ హుడ్ కు ఈ పాట హైలెట్ కానుందని సినీ అభిమానులు పేర్కొంటున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సాంగ్ ను ఓ రేంజ్ లో వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
కేతిక శర్మ ఈ ప్రత్యేక నంబర్‌లో హీట్‌ను పెంచుతోంది, ఆమె గ్లామర్ పాటకు మరింత అందాన్ని ఇచ్చేలా చేసింది. ఉల్లాస భరితమైన నృత్య కదలికలతో మంత్ర ముగ్ధులను చేస్తోంది. పాటను అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు వెంకీ కుడుముల.
ఆస్కార్ గీత రచయిత చంద్రబోస్ ఈ పాటను రాయగా నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి తమ అద్భుతమైన గొంతులతో ప్రాణం పోశారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ నిర్వహించారు.
Also Read : Hero Prabhas-Prasanth Varma :ప్రభాస్..ప్రశాంత్ వర్మ మూవీ టైటిల్ ఫిక్స్