Adah Sharma: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఇంటిని గుడిగా మార్చిన అదా శర్మ !

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఇంటిని గుడిగా మార్చిన అదా శర్మ !

Adah Sharma: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌… నాలుగేళ్ల క్రితం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు తగ్గడం, వ్యక్తిగత కారణాలతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నప్పటికీ… అతని మృతిపై ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని ప్రముఖ నటి అదాశర్మ(Adah Sharma) కొనుగోలు చేసినట్లు గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ పుకార్లకు చెక్ పెడుతూ… సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని తానే కొనుగోలు చేసినట్లు అదాశర్మ అధికారికంగా వెల్లడించారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ… సుశాంత్ ఇంట్లోనే నివాసముంటున్నట్లు తెలిపారు. ఆ ఇంట్లో తన అనుభవాలను తాజాగా పంచుకున్నారు.

Adah Sharma…

‘నెల క్రితమే గతంలో సుశాంత్‌ నివాసమున్న ఇంట్లోకి మారాను. ఇన్ని రోజుల నుంచి వరుస సినిమాలతో బిజీగా ఉన్నందున మారలేకపోయాను. నేను కొన్ని విషయాల్లో సున్నితంగా ఉంటాను. ముంబయి, కేరళలో మా ఇళ్లు చెట్ల మధ్యలో ఉంటాయి. వాటిపై వాలిన పక్షులకు, ఉడుతలకు ఆహారం పెడుతుంటాం. సుశాంత్‌ ఇంటిని చూడగానే నాకు ఎంతో పాజిటివ్‌గా అనిపించింది. అందుకే కొన్నాను. మొత్తం రీమోడలింగ్ చేశాను. వైట్‌ పెయింటింగ్‌ వేశాం. మొదటి అంతస్తుని గుడిలా మార్చేశాను. ఒక గదిని మ్యూజిక్‌ రూమ్‌గా, మరో దాన్ని డ్యాన్స్‌ స్టూడియోగా మార్చాను. టెర్రస్‌ మొత్తం గార్డెన్‌లా మార్చేశాను’ అని చెప్పారు.

బాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 2020 జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలో ఉరి వేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల మానసిక కుంగుబాటుకు గురి కావడంతోనే ఆయన మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు అదే ఇంటిని అదా కొనుగోలు చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : Hero Sivakarthikeyan : 3వ సారి తండ్రైన కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్

Adah SharmaSushant Singh Rajput
Comments (0)
Add Comment