Trisha Shocking Comments :ఫ్యాన్స్ కామెంట్స్ ముద్దుగుమ్మ సీరియ‌స్

వ్య‌క్తిగ‌త విష‌యాలు మీకెందుకంటూ ఫైర్

Trisha : వ‌య‌సు పెరిగినా డోంట్ కేర్ అంటోంది బ‌హు భాషా న‌టి అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణ‌న్. త‌ను ఇటీవ‌ల పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయింద‌ని టాక్. అత‌ను ఎవ‌రో కాదు త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ . త‌ను ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య‌కు కూడా విడాకులు ఇవ్వ‌డం ఒకింత ఆస‌క్తిని రేపింది. అయితే త్రిష‌(Trisha), విజ‌య్ ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు త్రిష కృష్ణ‌న్.

Trisha Shocking Comments

త‌ను కోలీవుడ్, టాలీవుడ్ లో బిజీగా ఉంది. ప‌లు సినిమాల‌లో న‌టిస్తోంది. తాజాగా అజిత్ కుమార్ తో క‌లిసి న‌టించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. తొలి రోజే ఏకంగా రూ. 28.5 నిక‌ర క‌ల‌క్షెన్స్ సాధించింది. సినీ వ‌ర్గాల‌ను విస్మ‌య ప‌రిచింది. మ‌రో వైపు మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టిస్తోంది త్రిష కృష్ణ‌న్(Trisha). సీనియ‌ర్ హీరోలంతా త‌మ బెస్ట్ ఛాయిస్ త‌ననే ప్రిఫ‌ర్ చేయ‌డం విశేషం. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పొన్నియ‌న్ సెల్వ‌న్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత విజ‌య్ తో చేసిన బీస్ట్ స‌క్సెస్ కావ‌డంతో త‌న స్టార్ ఇమేజ్ మ‌రింత‌గా పెరిగింది.

త్రిష తెలుగులో న‌టించిన చిత్రాల‌తో మ‌రింత ద‌గ్గ‌రైంది. త‌ను మ‌హేష్ బాబుతో చేసిన అత‌డు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ మూవీగా నిలిచి పోయింది. సిద్దార్త్ తో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ కూడా విజ‌య‌వ‌వంతం కావ‌డంతో వ‌రుస సినిమాల‌లో ఛాన్స్ లు ద‌క్కించుకుంది. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో త‌న క్యారెక్ట‌ర్ గురించి కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల సీరియ‌స్ గా స్పందించింది త్రిష కృష్ణ‌న్. విష పూరిత‌మైన మ‌న‌స్త‌త్వం ఉన్న‌వాళ్లే ఇలాంటి పోస్టులు పెడ‌తారంటూ పేర్కొంది. మీకంటూ జీవితం ఉంద‌ని తెలుసుకుంటే మంచిది. ఒక‌రిపై బుర‌ద చ‌ల్లేముందు మీ గురించి ఆలోచించు కోవాలంటూ హిత‌వు ప‌లికింది. మిమ్మ‌ల్ని చూస్తే త‌న‌కు జాలేస్తోందంటూ పేర్కొంది ఈ ముద్దుగుమ్మ‌.

Also Read : Sarangapani Jathakam Sensational :వినోద భ‌రితం సారంగపాణి జాతకం

CommentsShockingTrisha KrishnanViral
Comments (0)
Add Comment