Trisha : తమిళ సినీ రంగానికి చెందిన త్రిష కృష్ణన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను తమిళం, తెలుగు, హిందీతో పాటు మలయాళ సినిమాలలో కూడా నటిస్తోంది. బిజీగా మారింది. ఈ మధ్యనే తను దళపతి విజయ్ తో కలిసి నటించిన గోట్ దుమ్ము రేపింది. పాన్ ఇండియా లెవల్లో ఆ మూవీకి భారీ ఆదరణ లభించింది. మరో వైపు విజయ్ చివరి సినిమా దళపతి 69 మూవీలో కూడా కన్నడ నటితో పాటు త్రిష కృష్ణన్(Trisha) కూడా కీలక పాత్రలో కనిపంచనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు హెచ్ వినోద్ మాత్రం త్రిష నటిస్తారా లేదా అన్నది ఇంకా వెల్లడించలేదు.
Trisha Identity in OTT..
తాజాగా మలయాళంలో త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలో ఐడెంటిటీ మూవీలో నటించింది. ఈ సినిమా జనవరి 2న విడుదలైంది. అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీనిని పలు భాషల్లో విడుదల చేశారు. అన్నింటా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని ముందుకు సాగుతోంది. దీంతో త్రిష కృష్ణన్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
సినిమా సక్సెస్ తో ప్రముఖ ఓటీటీ సంస్థలు ఐడెంటిటీని చేజిక్కించు కునేందుకు పోటీ పడ్డాయి. కానీ ప్రముఖ నిర్మాణ, మీడియా సంస్థ జీ గ్రూప్ కు చెందిన జీ5 స్వంతం చేసుకుంది. ప్రస్తుతం దీనిని ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు. కానీ హిందీ వెర్షన్ ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్. మొత్తంగా త్రిష కృష్ణన్ హాట్ టాపిక్ గా మారడం విశేషం.
Also Read : Popular Producer Vedaraju : ప్రముఖ నిర్మాత వేదరాజు కన్నుమూత