Taapsee : ముంబై – భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది నటి తాప్సీ పన్ను. పూర్తిగా మహిళా ప్రాధాన్యత కలిగిన రోల్స్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. తను ఇప్పటికే నటించిన ‘పింక్’, ‘మన్మర్జియాన్’, ‘హసీన్ దిల్రుబా’ ఇతర చిత్రాలు బిగ్ సక్సెస్ అయ్యాయి. తనకు మరిచి పోలేని రీతిలో సంతోషాన్ని మిగిల్చేలా చేశాయి.
Taapsee Pannu Movie Updates
తాజాగా కొత్త సంవత్సరంలో కీలక అప్ డేట్ వచ్చింది. తన రాబోయే చిత్రం గాంధారి మూవీకి సంబంధించి షూటింగ్ లో పాల్గొంంటోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక వేదికల ద్వారా పంచుకుంది తాప్సీ పన్ను. తనకు ఇదే నిజమైన పండుగ అంటూ పేర్కొంది. అందమైన ట్యాగ్ లైన్ జతచేర్చింది ఈ అమ్మడు.
తమ ఆచారం ప్రకారం లోహ్రీని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, గాంధారీ షూటింగ్ సందర్బంగా జరుపుకోవడం మరింత ఆనందాన్ని కలిగించిందంటూ పేర్కొంది తాప్సీ పన్ను(Taapsee). ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే మథియాస్ బోను పెళ్లి చేసుకుంది.
థప్పడ్, ‘దోబారా’ చిత్రాలలో తాప్సీతో కలిసి పనిచేసిన నటుడు పావైల్ గులాటి, తాప్సీకి మంచి స్నేహితుడు అయిన రచయిత అనురాగ్ కశ్యప్‌తో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. డెన్మార్క్ కు చెందిన మథియాస్ ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ .
Also Read : Beauty Pooja Hegde : దయా మూవీలో పూజా అందాల ఆరబోత