Sumaya Reddy Shocking :తెలుగు అమ్మాయిలంటే చుల‌క‌న

సుమ‌య రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్

Sumaya Reddy : న‌టి, ర‌చ‌యిత‌, నిర్మాత‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన న‌టి సుమ‌య రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే ఇష్టం. సాహిత్యం, పాట‌లు, మూవీస్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంది. తాజాగా త‌ను న‌టించి, నిర్మించిన మూవీ డియ‌ర్ ఉమ‌. ఇది ప్రేమ‌కు సంబంధించిన క‌థ‌తో వ‌స్తోంది. ఇదే స‌మ‌యంలో త‌ను వైర‌ల్ గా మారింది సోష‌ల్ మీడియాలో. త‌ను న‌టిగానే కాదు సామాజిక కార్య‌క‌ర్త కూడా పేరు పొందారు.

Sumaya Reddy Shocking Comments

చిట్ చాట్ సంద‌ర్భంగా సుమ‌య రెడ్డి(Sumaya Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమా మీద ఉన్న పేష‌న్ తో తాను ఎన్నోసార్లు ట్రై చేశాన‌ని, టాలీవుడ్ లో మాత్రం భిన్నంగా తాను అనుభ‌వం ఎదుర్కొన్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చిన్న‌ప్పుడు తాను న‌ర‌సింహ చూశాన‌ని, ఆ మూవీ ప్ర‌భావం త‌న‌పై ఎంత‌గానో ప్ర‌భావం ప‌డింది. హీరోయిన్ అయితే కారులో తిర‌గ‌వ‌చ్చ‌ని ఆలోచ‌న వ‌చ్చింద‌ని, కానీ తాను అనుకోలేదు మూవీస్ రంగంలోకి వ‌స్తానంటూ చెప్పింది. త‌మ‌ది సంప్ర‌దాయ కుటుంబ‌మ‌ని చెప్పింది. త‌న స్వ‌స్థ‌లం రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లా.

సుమ‌య రెడ్డి ప్ర‌స్తుతం న‌టిగా నిరూపించుకునే ప‌నిలో ప‌డింది. సామాజిక కార్య‌క‌ర్త‌గా, నిర్మాత‌గా, మ‌హిళ‌గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేసింది. మ‌హిళ‌లు ఎందుకు నిర్మాత‌లు కాకూడ‌ద‌ని బ‌లంగా న‌మ్మి తానే స్వ‌యంగా సినిమాను నిర్మించ‌డం జ‌రిగింద‌న్నారు సుమ‌య రెడ్డి. ఇంటి నుంచి కూడా వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని, కానీ త‌న కోరిక‌ను అణుచుకోలేక పోయాన‌ని చెప్పింది. వ్యాపార మహిళగా సమాజంలో చాలా మందికి మంచి జీవన ప్రమాణాలను తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు, దాతగా తన ప్రేమ, దయతో చాలా మంది ప్రజల కడుపు నింపడం విశేషం. ప్ర‌స్తుతం డియ‌ర్ ఉమ ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి. సినీ ఇండ‌స్ట్రీపై చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Hero Vijay-Kingdom :మే 30న రానున్న రౌడీ కింగ్‌డమ్‌

CommentsShockingSumaya ReddyViral
Comments (0)
Add Comment