Actress Sonarika : ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడిన బుల్లితెర నటి సోనారిక

బాలీవుడ్ తెరపై ఓ వెలుగు వెలిగిన సోనారిక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే

Actress Sonarika : పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. సామాన్యులు, సెలబ్రిటీలు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా పెళ్లి చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల విషయంలో హడావుడి సాగుతుంది. పెళ్లిళ్ల ముహుర్తాలు ఉండడంతో అందరూ మూడు మూళ్ళ బంధంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా బుల్లితెర పార్వతి.. ‘దేవోన్ కే దేవ్ మహాదేవ్’ సీరియల్ తో బాగా ఫేమస్ అయిన సోనారిక భడోరియా పెళ్లి చేసుకుంది. సినీరంగంలో కొత్త ట్రెండ్‌ను నెలకొల్పిన మహదేవ్ సిరీస్‌లో సోనారిక శివ భార్య పార్వతి పాత్రలో నటించి మెప్పించింది. ఈ సిరీస్ తెచ్చిన ఉత్సాహం ఆమె బిగ్ స్క్రీన్‌లోకి ప్రవేశించడానికి దారితీసింది. తెలుగులో సీరియల్ సినిమాలు చేసింది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సోనారిక ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.

Actress Sonarika Marriage Updates

ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌తో ఆమె జతకట్టింది. వారి వివాహం వారి కుటుంబాలు, సన్నిహితులు మరియు ప్రియమైన వారితో చాలా అందంగా జరిగింది. వేదిక రాజస్థాన్‌లోని రణథంబోర్. పెళ్లి తర్వాత సోనారిక పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లి ఫోటోలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనారిక జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాలీవుడ్ తెరపై ఓ వెలుగు వెలిగిన సోనారిక(Sonarika) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2015లో నాగ శౌర్య నటించిన జాదూగాడు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటించిన స్పీడున్నోడు, మంచు విష్ణు ఇడోరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలలో ఆమె కనిపించింది. హిందీలో ‘సాన్సేన్’, తమిళంలో ‘ఇంద్రజిత్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ తెరపై యాక్టివ్‌గా ఉన్న సోనారిక పెళ్లి చేసుకుంది. దీంతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. కాగా, పెళ్లి వేడుకలో సోనారిక భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Bigg Boss Vasanthi: పెళ్లి పీటలెక్కిన ‘బిగ్‌బాస్’ బ్యూటీ వాసంతి !

ActressBollywoodCommentsTrendingUpdatesViral
Comments (0)
Add Comment