Sobhita Dhulipala : పెళ్లికి ముందే పిల్లల కోసం ప్రస్తావించిన నటి శోభిత

ఈ ఫోటో‌లను శోభిత ఇన్స్టా‌లో పోస్ట్ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టారు...

Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల.. పేరుకి తెలిగింటి ముద్దుగుమ్మే కానీ హవా నడిపించేది మాత్రం బాలీవుడ్‌లో. అద్భుతమైన కథల ఎంపికతో పాటు తనదైన నటన శైలితో శోభిత(Sobhita Dhulipala) తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అక్కినేని నాగ‌ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఈ భామ తరుచుగా న్యూస్‌లో కనిపిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ఫ్రాంచైజీతో ఆమె మరోసారి నేషనల్ వైడ్‌గా తన యాక్టింగ్ కెపాసిటీని నిరూపించుకున్నారు. ‘ పొన్నియన్ సెల్వన్-1’ సినిమా రిలీజై రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ఆమె సందడి చేశారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.

Sobhita Dhulipala Comment

తమిళనాడులో అత్యంత సంచలనం సృష్టించిన ‘పొన్నియిన్ సెల్వన్‌’ న‌వ‌ల ఆధారంగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్‌. రెండు భాగాలుగా తీర్చిదిద్దిన ఈ సినిమా ఘన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ప్రకటించిన ప్రతిష్టాత్మక ఐఫా అవార్డులలో ఈ సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడిగా విక్రమ్‌ అవార్డ్ అందుకోగా, క్రిటిక్స్‌ ఛాయిస్‌లో ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అంతా కలిసి ఫోటో షూట్ నిర్వహించారు.

ఈ ఫోటో‌లను శోభిత(Sobhita Dhulipala) ఇన్స్టా‌లో పోస్ట్ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో‌లో హీరో విక్రమ్​తో పాటు జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిషలతో కలిసి శోభితా ధూళిపాళ్ల ఫొటోలకి పోజ్ ఇవ్వగా ‘వీరందరు ఎవెంజర్స్‌, నా పిల్లలకు వీళ్ల గురించి చెప్తాను’ అంటూ ఆమె తన అభిమానాన్ని చాటుకున్నారు. 2016లో బాలీవుడ్ విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘రామన్ రాఘవ్ 2.0’ చిత్రంతో తెరంగ్రేటం చేసిన శోభిత హిందీ ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. కాగా 2018లో అడివి శేష్ యాక్షన్ స్పై ఫిల్మ్ ‘గూఢచారి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 2022లో వచ్చిన పొన్నియన్ సెల్వన్‌‌తో మరోసారి జాతీయ గుర్తింపు పొందారు. మరోవైపు మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వెబ్ సీరీస్‌లతో ఆమె ఓటీటీలోను ప్రత్యేక గుర్తింపు సాధించారు.

Also Read : Prabhas Movie : ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో బాలీవుడ్ లెజెండరీ నటుడు

CommentsSobhita DhulipalaViral
Comments (0)
Add Comment