Coolie : తలైవా రజనీకాంత్ నుంచి ఈ ఏడాది వచ్చిన ‘లాల్ సలామ్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, తదుపరి చిత్రంగా వచ్చిన ‘వేట్టయాన్ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున, సత్యరాజ్, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Coolie Movie Updates
ఇందులో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకి కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా సెట్‌లో శ్రుతిహాసన్ అడుగుపెట్టారు. ఆమెతోపాటు జూనియర్ ఆర్టిస్టులపై ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది చిత్రం.
ALso Read:Maadhavi Latha : అల్లు అర్జున్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న నటి