Shraddha Kapoor : కొత్తింటికి మారిన బాలీవుడ్ అగ్ర నటి ‘శ్రద్ధా కపూర్’

తాజాగా ఆ జాబితాలోకి శ్రద్ధా కపూర్ వచ్చి చేరింది...

Shraddha Kapoor : శక్తి కపూర్, శివంగి కొల్హాపురే కుమార్తె శ్రద్ధా కపూర్(Shraddha Kapoor). తీన్ పట్టి చిత్రంతో ఆమె తెరంగేట్రం చేసింది. తాజాగా నటించిన స్ట్రీ 2 చిత్రం బ్లాక్ బస్టర్‌‌గా నిలిచింది. ఆమె జుహులో కొత్తగా ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. నెలకు అద్దె ఎంతంటే.. జస్ట్ రూ.6 లక్షలు. జుహు.. ముంబయిలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. ముఖ్యంగా సినిమా స్టార్లు అత్యధికంగా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. తాజాగా ఆ జాబితాలోకి శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) వచ్చి చేరింది. ఈ ప్రాంతంలో ఆమె ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అది కూడా ఎంత అంటే.. జస్ట్ నెలకు రూ. 6 లక్షలకు అద్దెకు తీసుకుంది. ఏడాదికి రూ. 72 లక్షలు అడ్వాన్స్‌గా ఆమె చెల్లించారు. అందుకు లావాదేవీలకు సంబంధించి.. రూ.36,000 స్టాంప్ డ్యూటీతోపాటు రూ1,000 రిజిస్ట్రేషన్ ఫీజు శ్రద్ధా కపూర్ చెల్లించారు. అక్టోబర్ 16వ తేదీన ఆమె ఈ నగదు లావాదేవీలు జరిగాయి. ఇక ఈ ఫ్లాట్‌కు నాలుగు కార్లు పార్కింగ్ చేసుకునేందుకు వీలు కల్పించింది.

Shraddha Kapoor New Home…

ఇప్పటికే బాలీవుడ్ ఫిల్మ్ స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్, ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన నెలకు రూ. 8 లక్షల అద్దె చెల్లిస్తున్నారు. ఆయన మూడేళ్ల పాటు అద్దెకు తీసుకున్నారు. ఈ మేరకు జాప్కీ యాక్సెస్ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు బహిర్గతం చేశాయి. ఇక బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్, అతడి స్నేహితురాలు లేఖా వాషింగ్టన్ సైతం ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. అది కూడా సినీ నిర్మాత కరణ్ జోహార్ నుంచి మూడు సంవత్సరాల పాటు.. నెలవారీ అద్దెకు రూ.9 లక్షలకు లీజుకు తీసుకున్నారు. అందుకు రూ. 27 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేశారు. అయితే మంబయిలో బాలీవుడ్ నటీనటులు సొంతగా ఇల్లు కొనుక్కునే స్తోమత ఉంటుంది. కానీ వ్యక్తిగత ఎంపిక కారణంగా.. ఇప్పటికి అద్దె ఇంట్లో నివసించేందుకు వారు ఇష్టపడతారు. అలాగే వారు ఉండాలనుకుంటున్న ప్రాంతంలో అపార్ట్‌మెంట్ అందుబాటులో లేక పోవడం కూడా ఓ కారణం కావచ్చుననే అభిప్రాయం అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వ్యక్తమవుతుంది.

Also Read : Sonu Sood : కంటి చూపు లేక బాధపడుతున్న యువతికి చూపు ప్రసాదించిన సోనూసూద్

Shraddha KapoorTrendingUpdatesViral
Comments (0)
Add Comment