Shraddha Arya : కవల పిల్లలకు జన్మనిచ్చిన టాలీవుడ్ నటి శ్రద్ధ ఆర్య

2007లో గొడవ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైంది శ్రద్ధ...

Shraddha Arya : గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా ఆర్య(Shraddha Arya) శుభవార్త చెప్పింది. అమ్మగా ప్రమోషన్ పొందానంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) పుట్టారంటూ ఒక అందమైన వీడియోను పోస్ట్ చేసింది. నవంబర్ 29న తనకు ప్రసవం జరిగిందని ఇప్పుడు అందరమూ క్షేమంగానే ఉన్నామంటూ అందులో చెప్పుకొచ్చింది. ‘ ఈరెండు చిన్ని హృదయాలు మా కుటుంబాన్ని పూర్తి చేశాయి. మా మనసులు రెండింతల సంతోషంతో నిండిపోయింది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది శ్రద్ద. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రద్ధా ఆర్య దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పంజాబ్ కు చెందిన శ్రద్ధ 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హిందీలో నిశ్శబ్ద్‌ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

Shraddha Arya…

2007లో గొడవ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైంది శ్రద్ధ(Shraddha Arya). కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో వైభవ్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో శ్రద్దా ఆర్య అందం, అభినయానికి యూత్ ఫిదా అయిపోయారు. దీని తర్వాత రోమియో, కోతిమూక తదితర తెలుగు సినిమాల్లో నటించింది శ్రద్ధ. అయితే ఎందుకో గానీ ఆ తర్వాత మరే తెలుగు సినిమాల్లోనూ కనిపించలేదీ అందాల తార. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించిన శ్రద్ధ 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్‌తో కలిసి ఏడడుగులు వేసింది. 2021 నవంబర్‌లో శ్రద్ధ- రాహుల్ ల వివాహం జరిగింది. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ ఏడాది అక్టోబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తనకు ఓ అబ్బాయి,అమ్మాయి పుట్టారన్న శుభవార్తను పంచుకుందీ అందాల తార. కాగా ‘తుమ్‌హారి పాఖి’, ‘కుండలి భాగ్య’, ‘డ్రీమ్ గర్ల్’ లాంటి సీరియల్స్‌లో నటించి బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది శ్రద్ధ. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్‌లో చివరిసారిగా రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో మెరిసింది.

Also Read : Vijay Deverakonda : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా వాయిస్ ఓవర్ ఇవ్వనున్న రౌడీ బోయ్

Shraddha AryaTrendingUpdatesViral
Comments (0)
Add Comment