Actress Sheela : జస్టిస్ ‘హేమ కమిటీ’ రిపోర్ట్ పై స్పందించిన మరో సీనియర్ నటి ‘షీలా’

సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది షీలా...

Actress Sheela : మలయాళీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారిన హేమ కమిటీ నివేదికపై పలువురు నటీనటులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సినీరంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటపెట్టింది. దీంతో పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ఇప్పటికే మలయాళీ ఇండస్ట్రీలోని పలువురు సీనియర్ నటులపై కొంతమంది నటీమణులు షాకింగ్ ఆరోపణలు చర్చనీయాంశంగా మారింది. దీంతో మలయాళీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి నటుడు మోహన్ లాల్ తప్పుకున్నారు. అలాగే మరో 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. మహిళలపై లైంగిక వేధింపుల గురించి రియాక్ట్ అవుతూ.. ఇలాంటి కేసుల్లో సాక్ష్యాలు అడుగుతున్నారని.. ఎలా ఇవ్వాలో పోలీసులే చెప్పాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సీనియర్ నటి షీలా.

Actress Sheela Comment

సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది షీలా(Actress Sheela). రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలోనూ కీలకపాత్రలో కనిపించింది. తాజాగా జస్టిస్ హేమ కమిటీ నివేదికపై రియాక్ట్ అవుతూ.. “లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. కోర్టుకు వెళ్లినా.. సాక్ష్యం ఏమిటి? అని అడుగుతున్నారు. అంటే ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కౌగిలించుకుని ముద్దులు పెడితే, వెంటనే ప్రూఫ్ కోసం సెల్ఫీ తీసుకోవాలా?, మీరు హగ్ చేసుకుంటే నేను ఫోటో తీసుకుంటాను అంటూ ఎవరైన మహిళ అడిగాలా ?.. గతంలో ఎవరైనా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌కు ఫోన్‌ చేసి ఏదైనా మాట్లాడితే అది రికార్డు అయ్యేదా? అలాంటప్పుడు ప్రూఫ్ ఎలా చూపిస్తారు ? ” అంటూ ప్రశ్నించింది.

డబ్ల్యూసీసీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అందులోని నటీమణుల కెరీర్‌లు పోయాయని చెప్పుకొచ్చింది. పవర్ గ్రూప్ అంటే ఏమిటో అర్థం కావడం లేదని షీలా(Actress Sheela) వ్యాఖ్యానించారు. కందిత్ సారమ్మ, కళ్లిచెళ్లమ్మ వంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా తనకు పురుషుల కంటే ఎక్కువ పారితోషికం రాలేదని.. మహిళలకు ప్రాధాన్యత ఉన్న సినిమా అయినప్పటికీ వారికి ఎక్కువ పారితోషికం ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం షీలా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Also Read : Kangana Ranaut : ఏది ఏమైనా నా సినిమా రిలీజ్ ఆపేదే లేదు – కంగనా

ActressBreakingCommentsHema CommitteeViral
Comments (0)
Add Comment