Samyuktha Menon : వాయనాడ్ బాధితుల కోసం నటి సంయుక్త మీనన్…

తాజాగా స్టార్ హీరోయిన్ సంయుక్త మేనన్ వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది...

Samyuktha Menon : కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడి సుమారు 300 మందికి పైగా మృత్యువాత పడ్డార. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఈ విషాద ఘటన నుంచి వయనాడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చాలామంది ఆచూకీ తెలియడం లేదని బాధిత కుటుంబాలు బోరు మంటున్నాయి. మరోవైపు వయనాడ్ విపత్తు బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాల సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు.

తాజాగా స్టార్ హీరోయిన్ సంయుక్త మేనన్(Samyuktha Menon) వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్ కు తన విరాళం చెక్ ను అందజేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ విషాద ఘటన నుంచి వయనాడ త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. ‘ వయనాడ్(Wayanad) ప్రజలకు ఎదురైన విపత్తు ఎంతో ఆవేదనను కలిగిస్తోంది. ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలబడి, నా వంతు సహాయం అందిస్తున్నాను. విశ్వశాంతి ఫౌండేషన్ వయనాడ్ లో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు నా వంతు సహాయం అందించా. వయనాడ్ కు సపోర్ట్ గా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అక్కడి ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది సంయుక్త.

Samyuktha Menon Helps…

ప్రస్తుతం సంయుక్త షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆమె చేసిన మంచి పనిపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మధ్యన సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోందీ అందాల తార. మహిళల సంక్షేమం కోసం ఆదిశక్తి అనే ఫౌండేషన్ స్థాపించి సేవలు అందిస్తోంది.ఇక పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంయుక్త. ఆ తర్వాత బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ధనుష్ తో సార్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ మలయాళ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నిఖిల్ తో కలిసి స్వయంభు అనే సినిమాలో నటిస్తోంది.

Also Read : Naga Chaitanya : వేణు స్వామి కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగ చైతన్య

Samyuktha MenonUpdatesViralWayanad Landslide
Comments (0)
Add Comment