Beauty Sai Pallavi : ఆశ‌ల‌న్నీ తండేల్ మూవీ పైనే

ఫిబ్ర‌వ‌రి 7న రానున్న చిత్రం

Sai Pallavi : గ్రామీణ నేప‌థ్యం క‌థాంశంగా తెర‌కెక్కించిన చిత్రం తండేల్. ల‌వ్లీ పెయిర్ గా పేరొందిన అక్కినేని నాగ చైత‌న్య‌, నేచుర‌ల్ స్టార్ హీరోయిన్ సాయి ప‌ల్లవి(Sai Pallavi) క‌లిసి న‌టించిన ఈ మూవీపై న‌టీన‌టులు ఇద్ద‌రూ భారీ న‌మ్మ‌కాన్ని పెట్టుకున్నారు. ద‌ర్శ‌కుడు దృశ్య కావ్యంగా మ‌లిచాడ‌ని, సినిమాను త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని అంటోంది కేర‌ళ కుట్టి సాయి ప‌ల్ల‌వి.

Sai Pallavi Comment…

త‌ను బేసిక్ గా మ‌ల‌యాళీ అయిన‌ప్ప‌టికీ ప‌లు భాష‌లు స్వంతంగా నేర్చుకుంది. త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెబుతోంది. త‌ను ఎంచుకునే పాత్ర‌ల‌కు ఆత్మ గౌర‌వం ఉండాలని కోరుకుంటోంది. ఇక తండేల్ మూవీ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అంటోంది.

శేఖ‌ర్ క‌మ్ముల మూవీ త‌ర్వాత త‌మ కాంబినేష‌న్ మ‌రోసారి అల‌రించ బోతోంద‌ని, చైత‌న్య అద్భుత‌మైన న‌టుడంటూ కితాబు ఇచ్చింది. అయితే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో తాను క‌చ్చితంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యింది సాయి ప‌ల్ల‌వి.

ఇలాంటివి ఎందుకు ప్ర‌చారం చేస్తున్నారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని వాపోయింది. తన‌కు సినిమానే లోక‌మ‌ని, వేరే వాటి గురించి ప‌ట్టించుకోనంటూ స్ప‌ష్టం చేసింది న‌టి. ఏది ఏమైనా తండేల్ త‌మ‌ను గ‌ట్టెక్కించేలా చేస్తుంద‌ని చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ఆశిస్తున్నారు. వారి కోరిక నెర‌వేరాల‌ని కోరుకుందాం. ఈ చిత్రం ఫిబ్రవ‌రి 7న విడుద‌ల కానుంది.

Also Read : Ram Gopal Varma Shocking : రాం గోపాల్ వ‌ర్మ‌కు నోటీస్

CinemaCommentsIndian ActressSai PallaviThandelViral
Comments (0)
Add Comment